PM Narendra Modi : ట్రంప్ సుకాల ప్రభావం ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నాం
రైతులు, మత్స్యకారుల కోసం రాజీ పడే ప్రసక్తే లేదన్న పీయం మోడీ;
దేశ ప్రయోజనాల విషయంలో ఎట్టి పరిస్ధితుల్లో రాజీ పడే ప్రసక్తే లేదని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్ళ విషయంలో భారత్ వెనక్కి తగ్గకపోవడంతో మరో 25 శాతం సుంకాన్ని పెనాల్టీగా విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ఢిల్లీలోలో జరిగిన ఎంఎస్.స్వామినాథన్ శతజయంతి సదస్సులో ప్రధాని మాట్లాడారు. రైతుల ప్రయోజనాలే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యతని చెప్పారు. ఈ విషయంలో భారత్ ఎన్నటికీ రాజీ పడదన్నారు. అమెరికా సుంకాల పెంపుతో భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని నాకు తెలసని, అయినా రైతులు, మత్స్యకారుల ప్రయోజనాల కోసం వాటిని భరించడానికి సిద్దంగా ఉన్నమని ప్రధాని మోడీ ప్రకటించారు. ఎటువంటి పరిస్ధితులనైనా ఎదుర్కొనేందుకు భారత్ సిద్దంగా ఉందని ప్రధాని పునరుద్ఘాటించారు. ట్రంప్ పెనాల్టీ రూపంలో విధించిన అదనపు టారిఫ్ వల్ల ప్రస్తుతం టారిఫ్ 50 శాతానికి చేరుకుంది. ఈటారిఫ్ అమలైతే భారత్ ఎగుమతి చేసే 86 బిలియన్ డాలర్ల ఎగుమతులపై ప్రభావం పడుతుంది. అయిత ఈ అదనపు టారిఫ్‌ని వెంటనే అమలు చెయ్యమని ట్రంప్ ప్రకటించారు. ఎక్జిక్యూటివ్ ఆర్డర్ పై ట్రంప్ సంతకం చేసి అది అమలులోకి వచ్చిన 21 రోజుల తరువాత అదనంగా విధించిన 25 శాతం పెనాల్టీ సుంకాన్ని వర్తింప చేస్తారు.