అమెరికాలో పాలస్తీనా ఉగ్రవాదుల ఘాతుకం
Palestinian terrorists who shot and killed Israeli civilians challenged US security forces
అమెరికా రాజధాని వాషింగ్టన్ డిసీలో ఉగ్రవాదులు ఇజ్రాయల్ పౌరుల్ని పొట్టనపెట్టుకున్నారు. నగరంలోని కేపిటల్ జ్యూయిష్ మ్యూజియంలో జరిగిన కార్యక్రమంలో ఇజ్రాయల్ రాయబార కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
వారికి అత్యంత సమీపంలోకి వచ్చిన ముష్కరులు ఇద్దరు ఇజ్రాయల్ పౌరులను పొట్టన పెట్టుకున్నారు. చనిపోయిన వారిలో ఒక మహిళ కూడా ఉంది. ఘటన స్థలంలో ఫ్రీ పాలస్తీనా నినాదాలు చేశారు. పాలస్తీనా అనుకూలవాదులు ఈ దుర్మార్గానికి పాల్పడ్డారా…వారి పేరుతో ఎవరు చేసి ఉండవచ్చనే కోణంలో అమెరికా నిఘా సంస్థలు దర్యాప్తు ప్రారంభించాయి.
కాల్పులపై ఇజ్రాయల్ తీవ్రంగా స్పందించింది. ఘాతుకానికి పాల్పడ్డ ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా పట్టుకుని తీరుతామని, వారితో పాటు వారికి అండగా నిలిచివారిని కూడా వదిలిపెట్టేది లేదని ఇజ్రాయల్ ప్రకటించింది.
అమెరికా అధ్యక్షుడు నివాస భవనంతోపాటు అంతర్జాతీయంగా వివిధ ప్రతిష్టాత్మక సంస్థలు ఉండే వాషింగ్టన్ డీసీలో దుర్భేద్యమైన భద్రత ఉంటుంది. అలాంటి ప్రాంతంలో దాడి ఉగ్రవాదులు బరితెగించటం అమెరికా భద్రతా బలగాలకు సవాల్ గా మారింది.