కొడాలి నాని అరెస్టుకు రంగం సిద్దం

There is reliable information that former minister Kodali Nani is likely to be arrested

Update: 2025-05-27 05:09 GMT

మాజీ మంత్రి కొడాలి నానికి బిగ్ షాక్ తగలనుంది. నేడో, రేపు కొడాలి నాని అరెస్టు కానున్నట్లు తెలుస్తోంది. కేసుకు విచారణకు సహకరించకపోవడం, పారిపోతాడనే కారణంతో ఇప్పటికే కొడాలి నానిపై లుక్ అవుట్ వారెంట్ జారీ చేశారు. అయితే కొడాలి నాని గత కొంత కాలం నుంచి అనారోగ్యం బారిన పడటంతో చికిత్స తీసుకుంటున్నాడు.కొడాలి నానిపై ఇప్పటికే కేసులు ఉన్నాయి. రైతు మోషే కేసు, వాలంటీర్లతో బలవంతంగా రాజీనామా చేయించడం వంటి ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేష్పై సోషల్ మీడియాలో అసభ్యకరంగా మాట్లాడారని కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు ఇసుక, మట్టి, భూకబ్జాలకు సంబంధించి ఆరోపణలు, టిడ్కో ఇళ్ల పంపిణీ, జగనన్న కాలనీలో మెరక పేరుతో రూ.45 కోట్ల అవినీతి, విద్యుత్ అక్రమాలపై విజిలెన్స్ ఆరోపణలు ఉన్నాయి. వీటిన్నింటిపై విచారణ జరుగుతోంది.

కొడాలి నాని ఇటీవల హైదరాబాద్ లోని సంధ్య కన్వెన్షన్ లో ఓ వివాహ వేడుకకు హాజరైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నానికి ఇటీవల హార్ట్ ఆపరేషన్ జరిగింది. దీంతో ఆయన హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకుంటున్నారు. నాని ఆరోగ్యం ఇంకా సెట్ కాలేదని మెరుగైన చికిత్స కోసం ఆయన అమెరికా వెళ్లనున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో కృష్ణ జిల్లా ఎస్పీ… నానిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. నాని అమెరికా వెళ్లకుండా అడ్డుకునేందుకే ఈ నోటీసులు జారీ అయినట్లు ప్రచారం జరిగింది.

లుకౌట్ నోటీసులు జారీ చేసిన రోజే కొడాలి నాని ట్విస్ట్ ఇచ్చారు. హైదరాబాద్లో ఓ శుభాకార్యానికి హాజరై అందరికి షాకిచ్చారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్ సెంటర్లో జరిగిన వేడుకలో కనిపించారు. విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేశామని ఏపీ పోలీసులు హడావిడి చేస్తుంటే.. కొడాలి నాని హైదరాబాద్లో ప్రత్యక్షం కావడం చర్చనీయాంశమైంది. ముంబైలో సర్జరీ తర్వాత కొడాలి నాని బయటకు వచ్చారు. ఈ సర్జరీ తర్వాత ఆయన చాలా సన్నగా అయ్యారు.

కేంద్ర హోంశాఖలోని ఇమిగ్రేషన్ విభాగం ఆయనపై LOC (లుకౌట్ సర్క్యులర్) జారీ చేసింది. ఆయన వైద్యం కోసం విదేశాలకు వెళ్లే అవకాశం ఉండటంతో కృష్ణా జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. కొడాలి నాని అక్రమాలపై విచారణ జరుగుతుండటంతో ఆయన దేశం విడిచి వెళ్లకుండా ఈ చర్యలు తీసుకున్నారు. గుండె సమస్యతో బాధపడుతూ ముంబైలో సర్జరీ చేయించుకోగా.. ఆయన మెరుగైన వైద్యం కోసం అమెరికాకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరిగింది.

Tags:    

Similar News