వ్యవసాయ సమస్యలు తీర్చడానికి రైతు మిత్ర

Rythu Mitra - Farmers Friend" program to solve the agricultural problems of farmers

Update: 2025-06-10 04:26 GMT

రాష్ట్రంలోనే మొదటిసారిగా జగిత్యాల జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు రైతు మిత్ర" ఫార్మర్ ఫ్రెండ్" అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు, రైతులతో కలిసి జిల్లా వ్యవసాయ అధికారి బాస్కర్ రైతు మిత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ శాఖ అధికారులు, రైతులతో ప్రత్యక్షంగా సమావేశమై ఎలాంటి విత్తనాలు వాడాలి, పంటల్లో చీడపీడలు, ఎరువుల వాడకం, సస్యరక్షణ చర్యలు ఏవిదంగా చేపట్టాలి, రైతుల పంటల సాగు సమస్యలకు సమగ్ర పరిష్కారం రైతు మిత్ర ద్వారా అందిచనున్నారు. రాష్ట్రంలోనే మొదటి సారిగా జగిత్యాల జిల్లాలో రైతు మిత్ర కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి సోమవారం ఉదయం 10:30 గం నుండి మధ్యాహ్నం .1:30 వరకు సహాయ వ్యాసాయ సంచాలకుల (అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ (ఏడీఏ) జగిత్యాల, ధర్మపురి మరియు మెట్ పల్లి కార్యాలయాలలో రైతు మిత్ర కార్యక్రమం కొనసాగుతుంది. ప్రతి సోమవారం 2-3 శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ శాఖాధికారులు రైతులతో ప్రత్యక్షంగా సమావేశమవుతారు. రైతుల సమస్యలకు అప్పటికప్పుడే సమాధానాలు ఇవ్వడంతో రైతుల సమస్యల పరిష్కరాన్ని పేపర్ పై రాసి ఇస్తున్నారు. రైతుల సమస్యల రికార్డు పుస్తకంలో నమోదు చేసి అవసరమైన చర్యలు చేపట్టనున్నారు.

ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా వ్యవసాయ అధికారి బాస్కర్ మాట్లాడుతూ రాష్ట్రంలో మొదటిసారిగా జగిత్యాల జిల్లాలోని 3 వ్యవసాయ సంచాలకుల కేంద్రాలు అయిన జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి లలో రైతు మిత్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి సోమవారం ఉదయం 10:30 గం నుండి మధ్యాహ్నం 1:30 వరకు రైతు మిత్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని రైతులు తప్పకుండా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని కోరారు. ముఖ్యంగా పంటల సాగులో వచ్చే సమస్యలు, రసాయనాల వినియోగం, విత్తనాల వాడకం, నీటి వనరుల వినియోగం, చీడ పీడలు వంటి అంశాలపై శాస్త్రవేత్తలు వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తారని చెప్పారు. నిపుణుల ప్రత్యక్ష మార్గదర్శన ద్వారా రైతులకు అవగాహన పెరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ తిరుపతి, శాస్త్రవేత్తలు రజినీకాంత్, శ్రీనివాస్, రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News