మాజీమంత్రి కాకాని గోవర్దన్ రెడ్డిపై మరో కేసు

Court extends remand of former minister Kakani Govardhan Reddy for another 14 days

Update: 2025-06-09 11:58 GMT

వైసిపి సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి రిమాండ్ సోమవారంతో ముగియడంతో కోర్టు కాకానికి మరొక 14 రోజులు రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాకాని బెయిల్ పిటిషన్ ఈరోజు న్యాయస్థానం ముందుకు రాగా వాదోపవాదాలు విన్న న్యాయస్థానం బెయిల్ పిటిషన్ పై తీర్పు ఈనెల 11వ తేదీకి వాయిదా వేసింది.

కాకాని బెయిలుపై రెండు రోజుల్లో కోర్టు తీర్పు రానుండగా తాజాగా మరో కేసు నమోదు అయింది. కాకాని గోవర్ధన్ రెడ్డి కృష్ణపట్నం సమీపంలో అక్రమంగా ప్రైవేట్ చెక్ పోస్టు ఏర్పాటు చేసి కంపెనీల వద్ద అక్రమంగా భారీగా నగదు వసూలు చేశారు అని కొందరు ఇచ్చిన పిర్యాదు తో కాకాని గోవర్ధన్ రెడ్డిపై మరో కేసు నమోదు అయింది.

Tags:    

Similar News