లష్కర్ రంగంలో ఘాటైన హెచ్చరికలు
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి భవిష్యవాణి;
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి జాతర సందర్భంగా మాతంగి స్వర్ణలత అమ్మవారు ఈసారి భవిష్యవాణిలో తీవ్రంగా స్పందించారు. సాధారణంగా చెప్పే తీరులో కాకుండా, ఈసారి "ఫుల్ ఫైర్" మూడ్‌లో కనిపించారు. అమ్మవారి హెచ్చరికలు ఇలా ఉన్నాయి. భవిష్యవాణి మాతంగి స్వర్ణలత అమ్మవారి మాటల్లో...
ఎంత చెప్పినా వినక, గోరంత కనికరంతో సరిపెట్టుతున్నారు. నేను కన్నెర్రజేస్తే చేస్తాను. ఈసారి దేశాన్ని కాపాడే బాధ్యత నాపైనే ఉంది. అగ్నిప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి. మరోసారి మహమ్మారి విజృంభించే ప్రమాదం ఉంది. ముందుగానే ముద్దుగా హెచ్చరిస్తున్నాను. నా పిల్లలందరినీ కడుపులో పెట్టుకొని రక్షిస్తున్నాను. కానీ వారి తల్లిదండ్రులే కనికరం లేకుండా వారిని వదిలేస్తున్నారు
చిన్న చిన్న పూజలతో పెద్ద కోరికలు తీరుస్తున్నాను. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఓపిక పట్టాలి చెప్పండి. ఏటేటా వాగ్దానాలు తీసుకుంటారు. కానీ ఒక్కసారి కూడా నిజంగా నిబద్ధత చూపించరు. అయినా కూడా నేను నా బిడ్డలను కాపాడుతూనే ఉన్నాను. ఈసారి బాలభారతాలు సంతోషంగా ఉంటారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. పంటలు బాగా పండుతాయి
ఈ జాతర ఐదు వారాలపాటు పప్పు, బేళ్లం, ఫలహారంతో జరగాలి. పసుపు, కుంకుమలతో, వేపాకులతో శోభాయమానంగా ఉండాలి. నాలుగు వారాల్లో నా ఎదుట రక్తం చూపించండి. చూపించకపోతే నేను ఊరుకోను. అమ్మవారి ఈ భవిష్యవాణి సికింద్రాబాద్ ప్రజలందరికీ ఆలోచన కలిగించేలా ఉంది. తప్పులు చేయకుండా, భక్తితో జాగ్రత్తగా ముందుకు సాగాలన్న సందేశాన్ని అందించారు.