డ్రగ్స్ కేసులో ఎస్ఐబీ రిటైర్డ్ పోలీస్ అధికారి కొడుకు

రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ వేణుగోపాల్ రావు కొడుకు రవి తేజ;

Update: 2025-07-15 07:15 GMT

హైదరాబాద్ డ్రగ్స్ దందాలో ఎస్ఐబీ అధికారి(ఓ ఎస్ డి) కొడుకు పాత్రను ఈగిల్ అధికారులు గుర్తించారు. మల్నాడు రెస్టారెంట్ యజమాని సూర్య అమ్మినేని అరెస్టు తర్వాత పోలీసులు ఆ నెట్ వర్క్ పై దర్యాప్తు చేస్తున్న సందర్భంగా ఎస్ఐబీ అధికారి కొడుకు పాత్ర తెరపైకి వచ్చింది. ఈ వ్యవహారం ఈగిల్ అధికారులను షాక్ కు గురి చేసింది. ఈ పోలీసు అధికారి కొడుకు పాత్ర పై ఆరా తీస్తున్న క్రమంలో మరికొన్ని విషయాలు బయటపడ్డాయి. 2024 సంవత్సరంలో ఎస్ఐబీ అధికారి కొడుకు ఓ సారి దొరికినా పోలీసులు అతనిని అరెస్టు చేయకుండా జాప్యం చేశారనే విషయం కూడా ఈగిల్ అధికారులు గుర్తించారు. ఈ ఎస్ఐబీ పోలీస్ అధికారి ప్రస్తుతం ఓఎస్డీ గా ఎస్ఐబీ లోనే కొనసాగుతున్నారు. ఈ ఎస్ఐబీ అధికారిని ఫోన్ టాపింగ్ కేసులో ప్రాధమికంగా అనుమానించినప్పటికి ఆ తర్వాత అతను అప్రూవర్ గా మారాడనే ప్రచారం జరిగింది. ఈ ఫోన్ టాపింగ్ కేసులో ఈ అధికారి స్టేట్ మెంట్ ను కూడా రికార్డు చేశారు. తాజాగా అతను కొడుకు డ్రగ్స్ వ్యవహారంలో తెరపైకి రావడంతో ఇప్పుడు పోలీసు డిపార్ట్ మెంట్ లో సంచలనంగా మారింది. ఈ సూర్య అమ్మినేని తో అరెస్టు అయిన ఆరుగురిని ఈగిల్ అధికారులు కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ విచారణలో మరికొంత మంది సెలబ్రిటీలతో పాటు ప్రముఖుల చిట్టా బయటపడే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ రహస్యం ఏలా బయటపడిందంటే--

ఈగిల్ అధికారులు వారం రోజుల కిందట వారికి అందిన సమాచారం మేరకు కొంపల్లి లోని మల్నాడు కిచెన్ రెస్టారెంట్ యజమాని సూర్య అమ్మినేని తో పాటు మరో ఆరుగురిని అరెస్టు చేశారు. ఈ దర్యాప్తులో భాగంగా ఈగిల్ అధికారులు సాంకేతికంగా దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ సందర్భంలో ఈగిల్ పోలీసు అధికారులకు రాహుల్ తేజ గురిం తెలిసింది. అతని గురించి ఆరా తీసినప్పుడు 2024 జనవరిలో రాహూల్ తేజ పై నిజామాబాద్ పోలీసులు కూడా డ్రగ్స్ కేసులో అతనిని ఏ3 నిందితుడిగా ఎఫ్ఐఆర్ చేశారు. కాని అతనిని ఇప్పటి వరకు అరెస్టు చేయలేదు. ఈ విషయం పై ఈగిల్ అధికారులు ఆరా తీశారు. నిజామాబాద్ పోలీసులు డ్రగ్స్ కేసులో మిగతా నిందితులను విచారించినప్పుడు తమకు రాహుల్ తేజ డ్రగ్స్ అందిస్తుండే వాడని వాటిని ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ ల నుంచి తీసుకువచ్చేవాడని వాంగ్మూలం ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఆ కేసులో నిజామాబాద్ పోలీసులు రాహూల్ తేజ ను ఎందుకు అరెస్టు చేయలేదని ఆరా తీసినప్పుడు అతని ఎస్ఐబీ లో రిటైర్ అయ్యి , ప్రస్తుత్తం ఓఎస్డీగా పని చేస్తున్న అధికారి కొడుకని తెలిసింది. దీంతో ఈగిల్ అధికారులు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు తెలిసింది. ఈ నేపధ్యంలో ఎస్ఐబీ అధికారి కోడుకు వ్యవహారాన్ని ప్రభుత్వం దృష్టి కి తీసుకువెళ్లి అతని పై చర్యలకు తీసుకునేందుకు ఈగిల్ అధికారులు రెడీ అవుతున్నారు. అయితే తాజాగా సూర్య అమ్మినేని కేసులో అరెస్టు చేస్తారా లేదా నిజామాబాద్ కేసులలో అరెస్టు చేస్తారా అనేది ప్రశ్నార్ధకంగా మారింది.

కనీసం బెయిల్ కూడా వేసుకోలేదు....

ఎస్ఐబీ పోలీస్ అధికారి కావడంతో పోలీసులు ఏడాది గడుస్తున్నా అతనిని ఒక సారి కూడా టచ్ చేయకపోవడం గమనార్హం. మిగతా నిందితుల మీద చార్జీషీటు వేసినా ఎస్ఐబీ పోలీసు అధికారి కొడుకు రాహుల్ తేజ పై ఏలాంటి చర్య తీసుకోకపోవడంపై ఇప్పుడు పోలీసులు తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్నారు. రాహూల్ తేజ కూడా నిజామాబాద్ కేసులో ఏ3 గా ఉన్నప్పటికి కనీసం ఆ కేసులో బెయిల్ లేదా ముందప్తు బెయిల్ కూడా తెచ్చుకోకపోవడం అతనికి పోలీసులు ఏ విధంగా సహాకరించారో స్పష్టమవుతుందని ఈగిల్ అధికారులు అంటున్నారు.

Tags:    

Similar News