Fake Apps : ప్రభుత్వం ఎమర్జెన్సీ హెచ్చరిక.. మీ ఫోన్లో ఈ యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి
మీ ఫోన్లో ఈ యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి;
Fake Apps : సాధారణంగా ఏదైనా కొత్త మొబైల్ యాప్‌ను డౌన్లోడ్ చేయాలనుకుంటే వెంటనే గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్‌కు వెళ్లి యాప్‌ను ఇన్స్టాల్ చేసుకుంటాం. అయితే, అలా చేయడం మంచిది కాదు. ప్రభుత్వం కోట్ల సంఖ్యలో ఉన్న మొబైల్ వినియోగదారుల కోసం ఓ హెచ్చరికను జారీ చేసింది. కొన్ని ప్రమాదకరమైన యాప్‌ల గురించి అప్రమత్తం చేసింది. అవి కేవలం మీ డేటా, ప్రైవసీకే కాకుండా మీకు ఆర్థికంగా కూడా నష్టాన్ని కలిగించగలవు.
'సైబర్ దోస్త్' నుండి హెచ్చరిక
ఈ హెచ్చరికను సైబర్ దోస్త్ (ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది) జారీ చేసింది. సైబర్ దోస్త్ కొన్ని యాప్‌ల లిస్ట్ షేర్ చేసింది. ఇవి చూడటానికి రియల్ యాప్స్ అనిపించినప్పటికీ వాస్తవానికి ఈ నకిలీ యాప్‌లు ప్రజలను మోసం చేసేందుకు రూపొందించినవి. ఈ నకిలీ యాప్‌ల పట్ల జాగ్రత్తగా ఉండండి
సైబర్ దోస్త్ హెచ్చరించిన కొన్ని ప్రమాదకరమైన నకిలీ యాప్‌ల లిస్ట్ ఇదే. Loan Raina, Invoicer Experts, Granet Swift, Gupta Credit, Credit Edge, LoanQ, SmartRich Pro, Ultimate Lend, Cash Loan, CreditLens. ఇవన్నీ నకిలీ యాప్స్. ఫోన్లో ఈ యాప్‌లలో ఏదైనా ఇన్స్టాల్ చేసి ఉంటే వెంటనే వాటిని మీ ఫోన్ నుండి అన్ఇన్స్టాల్ చేయండి. ఈ యాప్‌లు మీ డేటాను చోరీ చేస్తాయి. మీ ప్రైవసీకి ప్రమాదంగా మారుతాయి. మీ బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తాయి. ఈ యాప్‌లకు విదేశీ సంబంధాలు ఉండే అవకాశం కూడా ఉంది.
ఏదైనా యాప్‌ను డౌన్లోడ్ చేసే ముందు దాని ప్రామాణికతను (Authenticity) తప్పనిసరిగా కన్ఫాం చేసుకోవాలి. RBI ధృవీకరించిన ప్లాట్‌ఫామ్‌లను మాత్రమే ఉపయోగించాలి. ఏదైనా వ్యక్తిగత సమాచారాన్ని (Personal Information) పంచుకునే ముందు ఆ యాప్ గురించి పూర్తిగా తెలుసుకోండి. ఏదైనా యాప్‌ను డౌన్లోడ్ చేసేటప్పుడు, ముందుగా దాని యూజర్ ఫీడ్‌బ్యాక్, రేటింగ్లను తప్పనిసరిగా తనిఖీ చేయండి. ఒకవేళ ఆ యాప్ గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్‌లో లభించకపోతే, గూగుల్‌లో శోధించి ఏదైనా థర్డ్ పార్టీ సైట్ లేదా తెలియని సైట్ల ద్వారా యాప్‌ను డౌన్లోడ్ చేసే తప్పు చేయకండి.