హైదరాబాద్ లో మూడు రోజుల పాటు మంచి నీటి సరఫరా బంద్
పలు ప్రాంతాల్లో తాగు నీటి సరఫరాలో అంతరాయం
హైదరాబాద్ జల మండలి ఈ నెల 9వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 11వ తేదీ ఉదయం 6 గంటల వరకు నగరం లోని పలు ప్రాంతాల్లో తాగు నీటి సరఫరాలో అంతరాయం కలగనున్నట్లు ప్రకటించింది..
గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ఫేజ్-1 కింద 900 మిల్లీమీటర్ల వ్యాసం గల వాల్వుల మార్పిడి పనులు చేపడుతున్న కారణంగా ఈ సమస్య తలెత్తనుంది. అదనంగా, ముర్మూర్, మల్లారం, కొండపాక పంపింగ్ స్టేషన్లలో మరమ్మతులు కూడా జరుగనున్నాయి..
ప్రభావిత ప్రాంతాలు:
డివిజన్ 6: ఎస్.ఆర్. నగర్, సనత్ నగర్, బోరబండ, ఎర్రగడ్డ, బంజారాహిల్స్, సోమజిగూడ, ఫతే నగర్, జూబ్లీహిల్స్ మరియు పరిసరాలు..
డివిజన్ 7: లాలాపేట్, తార్నాకా కొంత భాగం..
డివిజన్ 9: కుకట్ పల్లి, భాగ్య నగర్, మోతీ నగర్, కెపిహెచ్‌బి, బాలాజీ నగర్..
డివిజన్ 12: చింతల్, సుచిత్ర, షాపూర్ నగర్, సూరారం, గాజుల రామారం, జగద్గిరి గుట్ట..
డివిజన్ 8: అల్వాల్, మచ్చ బోలారం, యాప్రాల్, గౌతమ్ నగర్, మౌలాలి రిజర్వాయర్ పరిసరాలు..
డివిజన్ 14 (కాప్రా): చర్లపల్లి, రాధికా, కైలాసగిరి, మల్లాపూర్..
డివిజన్ 15: కొండాపూర్, మాధాపూర్, గచ్చిబౌలి, నల్లగండ్ల కొంత భాగం..
డివిజన్ 17: హఫీజ్ పేట్, మియాపూర్..
డివిజన్ 19: పొచారం..
డివిజన్ 21: కొంపల్లి, జవహర్ నగర్, దమ్మాయి గూడ, నాగారం, అయ్యప్ప కాలనీ..
డివిజన్ 22: నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతి నగర్, గండి మైసమ్మ, బోల్లారం, తెల్లాపూర్..
అదనంగా, ట్రాన్స్‌మిషన్-4 కింద హకీం పేట్ ఎయిర్ ఫోర్స్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, AIIMS బీబీనగర్ ప్రాంతాల్లో కూడా నీటి సరఫరా ప్రభావితం కానుంది.. గ్రామీణ నీటి సరఫరా విభాగంలో అలేర్ (భువనగిరి), ఘన్ పూర్ (మెడ్చల్/శామీర్‌పేట్) ప్రాంతాలు ప్రభావిత మవనున్నాయి..
ఈ నేపథ్యంలో, ఆయా ప్రాంతాల ప్రజలు తగినంత నీటిని ముందుగానే నిల్వ చేసుకోవాలని, నీటిని అత్యవసర అవసరాలకు మాత్రమే వినియోగించాలని జల మండలి విజ్ఞప్తి చేసింది. మరమ్మతుల పనులు పూర్తయిన వెంటనే నీటి సరఫరా పునరుద్ధరించ నున్నట్లు అధికారులు తెలిపారు