భైరవం అదితి శంకర్

గ్లామరస్ గా కనువిందు చేసే అదితి… భైరవంలో అచ్చతెలుగు అమ్మాయి;

Update: 2025-08-09 06:09 GMT

 తమిళంలో అధికంగా సినిమాలు చేస్తున్న అదితి శంకర్… తెలుగు వారిని అలరించేందుకు సిద్ధమైంది. వరలక్ష్మి వ్రతం ఫోటోలను అభిమానులతో పంచుకుంది. 


ప్రముఖ దర్శకుడు శంకర్ కుమార్తెగా సినీ రంగ ప్రవేశం చేసినా…అభినయంతో తనకంటూ సొంత ఇమేజ్ కోసం అదితి ముమ్మర ప్రయత్నాలే చేస్తోంది. 


శివకార్తికేయన్ జోడిగా తమిళంలో రెండోది మావీరన్ చిత్రంలో నటించిన అదితి… ఇదే చిత్రంలో సింగర్ గానూ నిరూపించుకుంది. 


త్వరలో రాబోయే భైరవంతో తెలుగు ప్రేక్షకులను మెప్పించేందుకు పల్లెటూరి పడుచుగా సిద్దమవుతోంది. ఇటీవలే భైరవం సినిమా టీజర్ కూడా విడుదలైంది.


సినీ జగత్తులో గ్లామరస్ గా కనువిందు చేసే అదితి… భైరవంలో అచ్చతెలుగు అమ్మాయిలా లంగ ఓనీ కట్టుకుని వెన్నలగా కనిపిస్తోంది. ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా నటిస్తున్నారు.


చూడగానే శిల్పం మాదిరి కనిపించే అదితి శంకర్…చదువుల్లో తక్కువేం కాదు. 


సినీ పరిశ్రమలోకి రాకముందే చెన్నై శ్రీరామచంద్ర విశ్వవిద్యాలయం నుండి ఎంబిబిఎస్ పట్టా అందుకుంది. సమయం దొరికినపుడు డాక్టర్ గా సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటోంది.


తమిళ చిత్రం విరుమాన్ తొ 2022లో సినీరంగ ప్రవేశం చేసిన అదితి శంకర్…చెన్నైలో 1993 జూన్ 19న జన్మించింది. 


విరుమాన్ లో నటుడు కార్తీకి ధీటుగా అదితి అదరగొట్టింది. 


తమిళ సినిమా గరుడన్ రిమేక్ గా వస్తున్న భైరవంలో ఆనందీ, దివ్యాపిళ్లైలతో అదితి పోటీపడుతోంది. తెలుగులో గని, మహావీరుడు తదితర సినిమాల్లో నేపథ్యగాయనిగా తన సత్తా చాటుకుంది. 



 courtesy : instagram





 


 


 


 




Tags:    

Similar News