తెరమరుగవుతున్న అను ఇమాన్యూయెల్
తెలుగు, తమిళం, మళయాల సినీ రంగాల్లో ఇటీవలి వరకు నటించింది
అను ఇమ్మాన్యుయేల్ తెలుగు, తమిళం, మళయాల సినీ రంగాల్లో ఇటీవలి వరకు నటించింది. అను అమ్మడి చేతిలో ప్రస్తుతం సినిమాలు లేకపోవడంతో ఆఫర్ల కోసం వెయిట్ చేస్తోంది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే అను లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది.
1997లో అమెరికాలోని డల్లాస్ లో జన్మించిన అను…విద్యాబ్యాసం అమెరికాలోనే సాగింది.
సైకాలజీలో డిగ్రీ చేసేందుకు కాలేజీలో చేరినా కోర్సు మధ్యలోనే ఇండియాకు వచ్చి సినిమాల్లో నటించేందుకు ప్రయత్నాలు మొదలపెట్టింది.
అను తండ్రి తంకచన్ ఇమ్మాన్యుయేల్ సిని నిర్మాత కావడంతో మొదటి నుంచి చిన్నదాని దృష్టి వెండితెరపైనే ఉంది.
స్వప్న సంచారి అనే మలయాళ చిత్రం ద్వారా బాలనటిగా ఈ ముద్దుగమ్మ వెండితెరపై ఆరంగేట్రం చేసింది.
తెలుగులో గోపీచంద్ సరసన ఆక్సిజన్ అనే చిత్రం ఒప్పుకుంది.
సినిమా చిత్రీకరణ సమయంలో నానీ సరసన మజ్ను అనే చిత్రంలో నటించటానికి ఒప్పుకుంది. తెలుగులో మజ్ను సినిమా ముందుగా విడుదలైంది
తెలుగులో ఈ బ్యూటీ చేసింది కొన్ని సినిమాలే అయినా మత్తెక్కించే అందంతో కట్టిపడేసింది.
గ్లామరస్ అను తెలుగులో పవన్ కళ్యాణ్‌తో అజ్ఞాతవాసి, అల్లు అర్జున్‌తో నా పేరు సూర్య చిత్రాలలో నటించినా.. ఈ చిత్రాలు ఆశించిన విజయం సాధించలేదు.
అందం, అభినయం ఉన్నా అను బేబీ సినీ రంగంలో నిలదొక్కుకోలేదు. ప్రస్తుతం తమిళంలో మాత్రమే ఒక సినిమా చేస్తోంది.
courtesy : instagram