కాంతా భాగ్యశ్రీ బోర్సే
విజయ్ దేవరకొండకి జోడీగా కింగడమ్ మూవీలో ఛాన్స్ అందుకుంది.;
పూణే నగరానికి చెందిన భాగ్యశ్రీ బోర్సే బాలీవుడ్ చిత్రం యారియాన్ 2తో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. గత ఏడాది తెలుగు వారికి పరిచయమైన భాగ్యశ్రీ మొదటి సినిమాలో తన పాత్రకు డబ్బింగ్ కూడా చెప్పుకుంది. కుర్రాళ్లని కళ్లతోనే కట్టిపడేసే భాగ్యశ్రీ…సోషల్ మీడియాలో తాజా ఫోటోలను షేర్ చేసింది.
పూణేకు చెందిన ఈ ముద్దుగుమ్మ 1999లో జన్మించింది. నైజీరియాలోని లాగోస్ లో భాగ్యశ్రీ బోర్సే చదువుకుంది.
భారతదేశం తిరిగి వచ్చి ఆమె బిజినెస్ మేనేజ్మెంట్ డిగ్రీలో చేరింది. ఆ సమయంలోనే మోడలింగ్ కెరీర్ గా ఎంచుకుని క్యాడబరీ సహా వివిధ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేసింది.
తరువాత హిందీలోనే ‘చందూ చాంపియన్’ సినిమాలో నటించింది.
తెలుగులో ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా సాంగ్స్ లో హరీష్ శంకర్ భాగ్యశ్రీని గ్లామరస్ గా చూపించారు. దీంతో యూత్ ని ఎట్రాక్ట్ చేసింది.
మిస్టర్ బచ్చన్ చిత్రం హిట్ కాకపోవడంతో భాగ్యశ్రీ బోర్సేకి హీరోయిన్ గా బ్రేక్ రాలేదు. అయితే ఆ సినిమా విడుదల కాకుండానే విజయ్ దేవరకొండకి జోడీగా కింగడమ్ మూవీలో ఛాన్స్ అందుకుంది.
దుల్కర్ సల్మాన్ తో హింది, తెలుగు, తమిళం మళయాలంలో తెరకెక్కిన కాంత సినిమాతో తన అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్దం అవుతోంది.
దుల్కర్ సల్మాన్, రానా కాంబినేషన్ లో కాంతా సినిమాలో హీరోయిన్ గా భాగ్యశ్రీకి చాన్స్ వచ్చింది.
పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాతో భాగ్యశ్రీ సూపర్ సక్సెస్ అందుకుంటాననే నమ్మకంతో ఉంది.
courtesy : instagram