మరాఠీ భామ జియా శంకర్
తెలుగు, తమిళ, మరాఠీ సినిమాల్లో నటించిన ముద్దుగుమ్మ బుల్లితెరపై దృష్టి సారించింది
మరాఠీ భామ జియా శంకర్. మొదటిసారి తెలుగులో సినిమా చేసిన జియా... వరుసగా తమిళ, మరాఠీ సినిమాల్లో నటించిన ముద్దుగుమ్మ ఆ తర్వాత బుల్లితెరపై దృష్టి సారించింది. సోషల్ మీడియాలో అభిమానులకు టచ్ లో ఉండే జియా తన అందచందాలతో కలవరపరుస్తోంది.
జియా శంకర్ 1995లో ముంబైలో జన్మించింది.
ఈ ముద్దుగుమ్మ 2013లో ఎంత అందగా ఉన్నావే తెలుగు సినిమాతో వెండితెరకు పరిచయమైంది
2017లో ఆ తర్వాత తమిళంలో కనావు వరియం సినిమా చేసింది.
2018లో తెలుగులో హైదరాబాద్ లవ్ స్టోరీ సినిమా చేసి అలరించింది
2022లో మరాఠిలో వేద్ సినిమా చేసిన జియా శంకర్ ఆ తర్వాత వెండితెరకు దూరంగా ఉంది.
ఏక్తాకపూర్ బాలాజీ టెలిఫిల్మ్స్ సమర్పణలో గుమ్రాహ్(ఎండ్ ఆఫ్ ఇన్నోసెన్స్) సీరియల్లో నటించి పాపులర్ అయింది.
2020లో జీ5 లో ప్రసారమైన వర్జిన్ భాస్కర్2 వెబ్ సీరీస్ లో నటించి గుర్తింపు పొందింది.
బిగ్ బాస్ OTT 2 ఫేమ్ జియా శంకర్ తన వ్యక్తిగత జీవితం గురించి చెపుతూ... అది గొప్పగా లేదని పంచుకున్నారు.
ఒకప్పుడు తన సహనటుడు పరాస్ అరోరాతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
ప్రస్తుతం సినిమాలు లేకపోయినా వెబ్ సీరీసుల్లో జియా శంకర్ బిజీగా ఉంది
courtesy: instagram