విశ్వంభరలో మౌనీరాయ్

సలాకర్ వెబ్ సీరీస్ లో ప్రధాన పాత్ర పోషించిన మౌనీ రాయ్;

Update: 2025-08-22 05:43 GMT

బెంగాలి భామ మౌనీ రాయ్ హిందీ సీరియల్ క్యూంకీ సాస్ భీ కభీ బహు థీ ధారావాహిక ద్వారా రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టింది. సలాకర్ వెబ్ సీరీస్ లో ప్రధాన పాత్ర పోషించిన మౌనీ రాయ్ త్వరలోనే తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన ప్రత్యేక గీతంలో కనువిందు చేయనుంది. 


దేవోంకీ దేవ్, మహదేవ్ లో సతీదేవి పాత్ర, నాగిన్ లోని శివన్యా, శివాంగీ పాత్రలు గుర్తింపు తీసుకొచ్చాయి. 


కథక్ నృత్య కళాకారిణి మౌనీ… 2014లో ఝలక్ దిఖలాజా అనే డ్యాన్స్ షోలో ఫైనలిస్ట్ గా నిలిచింది. ఐసీ నఫ్రత్ తో కైసా ఇష్క్ ధారావాహికలో జనూన్ పాత్రలో కూడా నటించింది.


 పశ్చిమ బెంగాల్లోని కుచ్ బిహార్ లో 1985లో జన్మించిన మౌనీ…పాఠశాల విద్య పూర్తయ్యాక ఢిల్లీలోని ప్రతిష్టాత్మక మిరాండా హౌస్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.


మాస్ కమ్యూనికేషన్ లో అడ్మీషన్ తీసుకున్నా… దాన్ని మధ్యలోనే వదిలేసి ముంబై చేరుకుంది మౌనీ.


బ్రహ్మాస్త్ర హిందీ సినిమాలో మౌనీ రాయ్ నటనకు గాను ఉత్తమ సహాయ నటిగా ఫిలిం ఫేర్ అవార్డు దక్కింది. 


మౌని రాయ్‌ తరచు దుబాయ్ వెళుతుండటంతో ఆ దేశ ప్రభుత్వం ఈ అందాల బామకు UAE గోల్డెన్ వీసా మంజూరు చేసింది. మూడు సంవత్సరాల స్నేహం తర్వాత మలయాళీ వ్యాపారవేత్త సూరజ్ నంబియార్‌ను 2022లో మౌనీ వివాహం చేసుకుంది. 


2025 కొత్త సంవత్సర వేడుకల్లో తప్పతాగిన మౌనీ రాయ్ పబ్లిగ్గా దొరికిపోయింది. ఫొటోలు, వీడియో రికార్డు చేయొద్దని మౌనీ భర్త నంబియార్ మీడియాను వేడుకోవల్సివచ్చింది.


2008లో పంజాబీ సినిమా హీరో హిట్లర్ ఇర్ లవ్ తో వెండితెరకు పరిచయం అయింది. 2018లో అక్షయ్ కుమార్ తో కలిసి గోల్డ్ సినిమా ద్వారా బాలీవుడ్ లో అడుగుపెట్టింది.


మౌనీరాయ్ బుల్లితెరపై తన సత్తా చాటినా వెండితెరపై హీరోయిన్ గా ఇంకా నిలదొక్కుకోలేదు. సరైన బ్రేక్ కోసం చూస్తోంది.


మెగాస్టార్ చిరంజీవితో బాలీవుడ్ నటి మౌనీ రాయ్, ఆయన రాబోయే సినిమా "విశ్వంభర" కోసం ఒక స్పెషల్ సాంగ్‌లో నటిస్తున్నారు.



 courtesy: instagram

Tags:    

Similar News