రోష్ నారా నర్గీస్ ఫక్రీ

bollywood actress Nargis Fakhri latest photo shoot

Update: 2025-05-27 12:09 GMT

మోడల్ గా కెరీర్ ప్రారంభించిన నర్జీస్ ఫక్రీ తర్వాత బాలీవుడ్ లోకి ఎంటర్ అయింది. తెలుగులో హరి హర వీరమల్లులో రోషనారాగా వస్తున్న నర్గీస్ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది.


అమెరికాకు చెందిన నర్గీస్ ఫక్రీ 1979 అక్టోబరు 20న జన్మించింది. బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా నర్గీస్ పేరొందింది.

 


నర్గీస్ తండ్రి పాకిస్థానీ కాగా తల్లి చెక్ రిపబ్లిక్ జాతీయురాలు. న్యూయార్క్ లో పెరిగిన నర్గీస్ మోడలింగ్ లో అడుగుపెట్టింది. కింగ్ ఫిషర్ క్యాలెండర్ ద్వారా ఇండియాకు పరిచయమైన నర్గీస్...ఇక్కడే స్థిరపడింది.


2011లో రాక్‌స్టార్‌ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టి తొలి సినిమాతోనే ఉత్తమ మహిళా నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు ఎంపికైంది. ఈ సినిమాలో రణబీరకపూర్ సరసన నర్గీస్ అదరగొట్టింది.

 



 రాక్‌స్టార్‌’ ద్వారా నర్గీస్‌కు మంచి పాపులారిటీ వచ్చింది. ఆ తర్వాత ‘అజర్‌’, ‘డిషూమ్‌’ సహా పలు పెద్ద సినిమాల్లో నటించి బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.



నటుడు ఉదయ్ చోప్రాతో ప్రమాయణం సాగించిన నర్గీస్ మూడునాళ్ల ముచ్చటగా ముగిసింది. ఆ తర్వాత నిర్మాత మాట్ అలోంజోతో స్నేహం అర్ధాంతరంగా ముగిసింది. దీంతో ఇప్పట్లో పెళ్లికి అవకాశం లేదని చెపుతోంది.



 నర్గీస్ సోదరి అలియా న్యూయార్క్‌లో మాజీ ప్రియుడు ఎడ్వర్డ్ జాకబ్స్ ఓ గ్యారేజీలో ఉన్న సమయంలో అలియా ఆ గ్యారేజ్ కు నిప్పు అంటించింది.


ఈ ఘటనలో ఎడ్వర్డ్ జాకబ్స్ తోపాటు ఆలియా స్నేహితుడు ఇద్దరూ మరణించారు. న్యూయార్క్ పోలీసులు ఆలియాను అరెస్టు చేసినపుడు ఇండియాలో నర్గీస్ కుటుంబనేపథ్యం అందరికీ తెలిసింది.


 రాక్ స్టార్ లో కాశ్మీరీ పండిట్ గా నర్గీస్ మెప్పించింది. కందిరీగ హిందీ రిమేక్ మై తేరా హీరో లో హీరోయిన్ గా ఇలియానాతో పోటీపడింది. 



 courtesy : instagram


Tags:    

Similar News