తులు చిన్నది నేహా శెట్టి

తెలుగులో వరుస సినిమాలు చేస్తోంది.

Update: 2025-09-02 12:42 GMT

టాలీవుడ్ హీరోయిన్ నేహా శెట్టి కన్నడ, తెలుగు సినిమాల్లో బిజీగా ఉంది. కన్నడ నాట ఒకటే సినిమా చేసినా తెలుగులో వరుస సినిమాలు చేస్తోంది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే నేహా..  మత్తెక్కించే చూపులతో ఫోటోలకు పోజులు ఇచ్చింది.


కర్ణాటకలోని మంగళూరు ప్రాంతానికి చెందిన తులు అమ్మడు నేహా శెట్టి.


మంగళూరు అంటే సినీ పరిశ్రమలకు అందాల భామలను అందించే ఫ్యాక్టరీ అనే పేరుంది


1994లో జన్మించిన నేహా మొదటి నుంచి సినీ ప్రపంచంలోకి రావడమే టార్గెట్ గా పనిచేస్తోంది


2014లో మిస్ మంగళూరు అందాల పోటీ గెలిచి… మిస్ సౌత్ ఇండియా 2015 రన్నరప్‌గా నిలిచింది

 



2016లో కన్నడలో ముంగారు మలే 2 లో నటించిన నేహా ఆ తర్వాత కన్నడ వైపు చూడలేదు


2018లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మెహబూబాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది


మెహబూబా తరువాత న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో యాక్టింగ్ కోర్సును అభ్యసించడానికి ఆరు నెలల వెళ్లిన నేహా ఆ తర్వాత జైత్రయాత్ర మొదలుపెట్టింది 


2021లో రెండు సినిమాల్లో నటించింది. 


మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌లో చిన్న పాత్రతోపాటు గల్లీ రౌడీలో హీరోయిన్ గా నేహా అవకాశం చేజిక్కించుకుంది 


 2022లో డిజె టిల్లులో అదరగొట్టె నటనతో టిల్లు రాధికగా నేహా పాపులర్ అయింది


ప్రస్తుతం చేతిలో సినిమాలు లేకపోయినా అభిమానుల్లో క్రేజ్ తగ్గలేదు.



 courtesy : instagram



 



 


 


 


 


 


Tags:    

Similar News