నియాతీ ఫత్నానీ హాట్ వెబ్ సీరీస్
నియాతి ఆకాంక్షపురిల మధ్య హస్కీ సంభాషణ గమ్మత్తుగా సాగుతోంది;
నియాతి ఫత్నాని పంజాబీ, హిందీ సినిమాల్లో అడపాదడపా మెరుస్తోంది. ప్రస్తుతం OTT లో నియాతి నటించిన రోజ్ గార్డెన్ తెరకెక్కింది. నియాతి ఆకాంక్షపురిల మధ్య హస్కీ సంభాషణ గమ్మత్తుగా సాగుతోంది.
బుల్లితెరపై సందడి చేస్తున్న నియాతి ఫత్నాని 1991లో గుజరాత్ రాజ్ కోట్ లో జన్మించింది. గుజరాత్ భావ్ నగర్ లో విద్యాబ్యాసం పూర్తి చేసిన నియాతి మోడలింగ్ నుంచి టెలివిజన్ రంగంలోకి అడుగు పెట్టింది.
2016లో డి4-గెట్ అప్ అండ్ డాన్స్ తో నిహారిక సిన్హా పాత్రతో ఎంటర్ అయిన నియాతి… నజర్ అనే అతీంద్రియ ధారావాహికలో పియా రాథోడ్ పాత్ర ద్వారా పాపులారిటీ సాధించింది.
2017లో ఎజాజ్ ఖాన్ తో కలిసి యే మోహ్ మోహ్ కే ధాగే చిత్రంలో నటించింది.
2018 నుండి 2020 వరకు బుల్లితెరపై వచ్చిన నజర్ సీరీస్ లో హార్ష్ రాజ్‌పుత్ సరసన వయ్యారాలు ఒలకబోసింది.
కథక్ నృత్యంలో ప్రావిణ్యం ఉన్న నియాతి 2021లో వచ్చిన అంఖే దాస్తాన్ అనే టెలిఫిల్మ్ లో పియా పాత్ర పోషించింది.
2022లో చన్నా మేరియా ధారవాహికలో కరణ్ వాహి సరసన గిన్నీ గరేవాల్ సింగ్ పాత్రను ఫత్నాని పోషించింది.
2023లో డిస్నీ+ హాట్‌స్టార్ లో వచ్చిన డియర్ ఇష్క్ లో సెహ్బాన్ అజీమ్ సరసన అస్మిత రాయ్ గా నియాతీ ఫత్నాని కనువిందు చేసింది.
2023లోనే ఫూ సే ఫాంటసీ.. ఆ తర్వాత 2024లో ఫియర్ ఫ్యాక్టర్ ఖత్రోన్ కే ఖిలాడి 14లో పాల్గొని విమర్శకుల మనసు చురగొన్నది.
మోహ్ మోహ్ కే ధాగేలో లీడ్ పాత్ర పోషించిన నియాతీ అందులో 40 ఏళ్ల వయసులో ఉన్న వ్యక్తితో ప్రమాయణం కొనసాగిస్తుంది.
నిజ జీవితంలో తన వయసుకు డబుల్ వయసు వారితో ప్రేమాయణం కొనసాగిస్తే తప్పేంటి అని కామెంట్ చేసి సినీ పరిశ్రమలో సంచలనానికి కేంద్ర బిందువు అయింది.
courtesy : instagram