వార్తల్లో రుక్సర్ థిల్లాన్
టాలీవుడ్ లో ఈ అమ్మడు బిజీగా ఉంది;
రుక్సార్ ధిల్లాన్ తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషాల్లో సినిమాలు చేసింది. నాసామి రంగ సినిమాలో నాగార్జునతో మెరిసిన ఈ భామ ఏది మాట్లాడినా సూటిగా తేల్చేస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ అమ్మడు బిజీగా ఉంది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే రుక్సార్ తాజాగా షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఈ భామ లండన్‌లో 1993లో జన్మించినా భారతదేశంలోనే పెరిగింది.
పంజాబీ కుటుంబానికి చెందిన రుక్సార్ విద్యాబ్యాసం గోవా, బెంగుళూరుల్లో సాగింది.
మొదట మోడలింగ్ చేసిన ఈ చిన్నది తర్వాత చిత్రపరిశ్రమలోకి వచ్చింది.
2016లో వెండితెరకు పరిచయమైన రుక్సార్….మొదట కన్నడలో రన్ అంథోని సినిమా చేసింది. ఈ సినిమాలో ప్రముఖ నటుడు రాజ్ కుమార్ మనవడు వినయ్ రాజ్ కుమార్ తో జతకట్టింది.
2017లో ఆకతాయి సినిమాతో టాలీవుడలో కాలు మోపింది. ఈ సినిమా తర్వాత తెలుగులో వరుసగా చేస్తూ దూసుకుపోతోంది.
2020లో హిందీలో భాంగ్రా పే లే, 2022లో జాదుఘర్ సినిమాలో చేసిన రుక్సార్ బాలీవుడ్ నుంచి మళ్లీ టాలివుడ్ వైపు మళ్లింది.
హిందీలో జుగదిస్థాన్ వెబ్ సీరీస్లో లీడ్ రోల్ చేస్తోన్న రుక్సార్…అన్ని భాషల్లో సినిమాలు చేయాలనేది తన లక్ష్యం అంటోంది.
దిల్ రుబా సినిమా ఫంక్షన్ లో రుక్సార్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో ఒక్కసారి వార్తల్లోకి వచ్చింది.
తనకు కంఫోర్టుగా లేదని చెపుతున్నా ఫోటోలు తీస్తున్నారని మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేయటంతో టాలీవుడ్ ఫోటోగ్రాఫర్లు ఈ భామను కొంత పక్కన పెట్టారని వార్తలు వస్తున్నాయి.
courtesy : instagram