చాన్స్ ల కోసం సాయి మంజ్రేకర్

మరాఠీ, హిందీ, తెలుగు భాషాల్లో అరడజనుకు పైగా సినిమాలు;

Update: 2025-07-28 07:49 GMT

సాయి మంజ్రేకర్ మరాఠీ, హిందీ, తెలుగు భాషాల్లో అరడజనుకు పైగా సినిమాలు చేసింది. అగ్రహీరోలతో జతకట్టినా సినిమా చాన్స్ ల కోసం వేచి చూడాల్సి వస్తోంది. సోషల్ మీడియాలో ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.


కరెంటు తీగలా కనిపించే ఈ చిన్నది 2001లో ముంబైలో జన్మించింది. చూడగానే ఆకట్టుకునే నిషా కళ్లతో కట్టిపడేస్తుంది.


మరాఠీ కుటుంబానికి చెందిన సాయి మంజ్రేకర్ ముంబైలో ధీరుబాయి ఇంటర్నేషనల్ స్కూల్లో విద్యాబ్యాసం చేసింది. 


అమ్మడి తల్లిదండ్రులు కూడా సెలబ్రిటీలే. బాలీవుడ్ నటుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత మహేశ్ మంజ్రేకర్ గారాల పట్టి. తల్లి మేధా కూడా మరాఠీ చిత్రసీమలో ప్రముఖ నటి 


2012లో కక్ పర్ష్ అనే మరాఠీ సినిమాతో వెండితెరకు బాల నటిగా పరిచయం అయింది. ఆ తర్వాత ఆరేళ్ల విరామంతో జాక్ పాట్ కొట్టింది


 2019లో దబాంగ్-3లో లీడ్ రోల్ దక్కించుకుని తన సత్తా చాటింది. సల్మాన్ ఖాన్ తో ధీటుగా నటించి పాపులారిటీ సొంతం చేసుకుంది


2022లో గని సినిమాలో నటించి తెలుగు చిత్రపరిశ్రమలో అడుగుపెట్టింది. 


వరుణ్ తేజ్ తో జతకట్టిన అమ్మడు తెలుగువారిని మెప్పించింది. 


ఆ తర్వాత మేజర్, స్కంధ తదితర తెలుగు సినిమాలు చేసి తెలుగు వారికి దగ్గరైంది సాయి మంజ్రేకర్


2024లో ఔర్ మై కహా ధూం థా సినిమాలో అజేయ్ దేవగన్, టబులతో కలిసి నటించిన సాయి మంజ్రేకర్ ఆ తర్వాత అవకాశాల కోసం ఎదురు చూస్తోంది. 


చేసినవి కొన్ని సినిమాలే అయినా ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో మామూలు ఫాలోయింగ్ లేదు. 



 courtesy : instagram





 




 


Tags:    

Similar News