బాలీవుడ్ టు అమెరికా షామా సికిందర్
షామా సికిందర్ అసలు పేరు షామా గెసావత్;
బాలీవుడ్ హీరోయిన్ షామా సికిందర్ అసలు పేరు షామా గెసావత్ కాగా ఆ తర్వాత తండ్రి పేరును కలుపుకుని షామా సికిందర్ గా మారింది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న షామా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్ లోనే ఉంటుంది.
షామా సికిందర్ ఆగస్టు 4, 1981న రాజస్థాన్‌లోని మక్రానాలో జన్మించింది.
బాలీవుడ్ లో మెరిసిన షామా సికిందర్.. మజ్ను రిమిక్స్, హవా కర్దా మ్యూజిక్ అల్బమ్స్ తర్వాత ఆఫర్లు తగ్గాయి.
రాజస్థాన్ నుంచి ముంబై వచ్చాక షామా కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోగా…షామా విద్యాబ్యాసం కూడా అర్దాంతరంగా ముగిసింది.
చిన్న వయసులోనే ముంబై తనేజా యాక్టింగ్ స్కూల్లో చేరి మెలుకువలు నేర్చుకుంది.
షామా… 1998లో ప్రేమ్ అగ్గన్ సినిమాలో చిన్న పాత్ర ద్వారా వెండితెరకు పరిచయమైంది.
1999లో మాన్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి, యే మేరీ లైఫ్ హై (2003-2005) టీవీ సిరీస్‌లలో ప్రధాన పాత్రలో నటించి మంచి గుర్తింపు పొందింది.
మాయ, అబ్ దిల్ కి సున్ వెబ్ సీరీసుల్లో నటించిన షామా సికిందర్ తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
అందాల ఆరబోతకు వెనుకాడని ఈ ముద్దగుమ్మ ముస్లిం కాగా ఆయా వర్గాల నుంచి వచ్చిన బెదిరింపులను ఖాతరు చేయలేదు.
నటనలో భాగంగా… పాత్ర ప్రాధాన్యతకు అనుగుణంగా వేసుకునే దుస్తులపై అనవసర రాద్దాంతం చేయొద్దని తనను హెచ్చరించే వారికి హితవు పలికింది.
అమెరికాకు చెందిన క్రిస్టియన్ వ్యాపారవేత్తను 2022లో పెళ్లి చేసుకున్న షామా సికిందర్ ఆ తర్వాత వెండితరపై దర్శనం ఇవ్వటం తగ్గింది.
courtesy : instagram