పంజాబీ చిన్నది సోనమ్ బజ్వా
హిందీ, పంజాబీలో బిజీగా ఉన్న ఈ అమ్మడు తెలుగు వారిని కూడా అలరించింది.
పంజాబీ హీరోయిన్ సోనమ్ బజ్వా. హిందీ, పంజాబీలో బిజీగా ఉన్న ఈ అమ్మడు తెలుగు వారిని కూడా అలరించింది. వరుస సినిమాలతో దూసుకుపోతున్న సోనమ్ సోషల్ మీడియాలో అభిమానులను అలరిస్తోంది.
సోనమ్ బజ్వా ఉత్తరఖండ్ లోని నైనిటాల్ లో 1989వ సంవత్సరంలో జన్మించింది.
సిక్కు కుటుంబానికి చెందిన సోనమ్ ఢిల్లీ యూనివర్శిటీలో చదువుకుంది.
2012లో ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్నది.
మొదట ఎయిర్ హోస్టెస్ గా కెరీర్ ప్రారంభించిన ఈ సొట్టబుగ్గల చిన్నది...అనతికాలంలోనే నటనలో శిక్షణకు సిద్దమైంది.
2013లో బెస్ట్ ఆఫ్ లక్ పంజాబీ సినిమాతో వెండితెరకు పరిచయమైంది.
2014లో తమిళంలో కప్పాల్ సినిమా చేసినా ఆ తర్వాత మళ్లీ పంజాబీ సినిమాలపైనే దృష్టి సారించింది.
2016లో తెలుగులో బాబు బంగారం సినిమా చేసి టాలీవుడ్ కు పరిచయమైంది.
బాబు బంగారం సినిమా తర్వాత ఆటాడుకుందాం రా సినిమా చేసి తెలుగు వారిని అలరించింది.
2024లో హౌస్ ఫుల్ 5, బాగీ సినిమాల ద్వారా బాలీవుడ్లో పాపులర్ అయింది.
courtesy:instagram