బన్షివాలా పావోలి దామ్

Bengali actress paoli dam latest photo shoot;

Update: 2025-07-01 08:06 GMT

పావోలి దామ్ బెంగాలీ సినిమా, టెలివిజన్ రంగాలలో స్టార్ హీరోయిన్. బన్షివాలా వంటి కళాత్మక చిత్రాల్లో నటించిన పావోలి ని అభిమానులు పావో అని ముద్దుగా పిలుచుకుంటారు. సోషల్  మీడియాలో యాక్టీవ్ గా ఉండే పావోలీ ఫాలోవర్స్ గట్టిగా ఉన్నారు.


బంగ్లాదేశ్ కు చెందిన పావోలి కుటుంబం కలకత్తా వచ్చింది. 1980వ సంవత్సరంలో కలకత్తాలో జన్మించింది.  


కలకత్తాలోని రాజాబజార్ సైన్స్ కాలేజీలో కెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్(పిజి) పూర్తి చేసిన పావోలి రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టింది   


"జిబోన్ నియే ఖేలా" అనే బెంగాలీ సీరియల్ ద్వారా 2003లో పావోలి కెరీర్‌ ప్రారంభించింది. 


 ఛత్రక్ (2011), హేట్ స్టోరీ (2012) సినిమాలతో  పావోలి దామ్ స్టార్ డమ్ వచ్చింది. 


పావోలి నటించిన తితిర్ అతిథి బెంగాలీ టెలివిజన్ సీరియల్ ETV బంగ్లాలో ఆరు సంవత్సరాలు నడిచింది. 


హేట్ స్టోరీ సినిమా ద్వారా హిందీలో బోల్డ్ పాత్రల్లో నటించిన పావోలీ దామ్ ఆ తర్వాత అక్కడ అవకాశాలు  రాలేదు


పావోలి కొంకణి  సినిమాలో కూడా నటించింది. బాగా బీచ్ అనే కొంకణి సినిమాలో 2013లో చేసింది


కాలీ, ది గ్రేట్ ఇండియన్ మర్డర్ బెంగాలి వెబ్ సీరీస్ నటిగా బుల్లితెర అభిమానులను ఆకట్టుకుంది.


నాటోపర్ మోటో(Natoker Moto)లో ఆమె నటనకు 2016లో హైదరాబాద్ బెంగాలీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటిగా అవార్డు గెలుచుకుంది. 



 courtesy : instagram



 


 







Tags:    

Similar News