బొద్దుగుమ్మ మన్నారా చోప్రా

ఫ్యాషన్ డిజైనర్‌గా, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా మన్నారా చోప్రా పాపులర్

Update: 2025-09-09 07:54 GMT

బాలీవుడ్ నటి మన్నారా చోప్రా... ఫ్యాషన్ డిజైనర్‌గా, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పాపులర్. బొద్దుగా ఉండే ఈ ముద్దుగుమ్మ నిషా కనులతో కవ్వించే ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.


హర్యానాకు చెందిన బాలీవుడ్ హీరోయిన్ మన్నారా చొప్రా 1991లో జన్మించింది.


2014లో సినీ రంగంలోకి ప్రవేశించిన మన్నారా చొప్రా ఒకే ఏడాది తెలుగు, హిందీ భాషాల్లో సినిమాలు చేసింది.


తెలుగులో ప్రేమ గీమా జాన్తా నై… హిందీలో జిద్ సినిమాతో పరిచయం అయింది. 


ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ టాప్ హీరోయిన్లు ప్రియాంక చొప్రా, పరిణితీ చొప్రాలకు సోదర వరుస అవుతుంది. వారి ప్రోద్బలంతోనే మన్నారా సినీ రంగంలోకి వచ్చింది.


అన్నట్టు మన్నార చొప్రా అసలు పేరు బార్బీ హండా. అయితే సినీ రంగంలోకి వచ్చే సమయంలో సోదరి ప్రియాంక చొప్రా సూచన మేరకు మన్నారా చొప్రాగా పేరు మార్చుకుంది.


మన్నారా హిందీతో పోలిస్తే తెలుగులోనే అధికంగా సినిమాలు చేసింది. సునీల్ తో జక్కన్న, సాయి ధరమ్ తేజ్ తో కలిసి తిక్క, రోగ్, సీత తదితర సినిమాలు చేసింది.



దక్షిణాదిలో అడపాదడపా సినిమాలు చేస్తున్న మన్నారా… బాలీవుడ్ లో నిలదొక్కుకునేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది.


ఇటీవలి కాలంలో పంజాబీ సినిమాల్లో మన్నారాకు అధికంగా అవకాశాలు వస్తున్నాయి. మోడలింగ్ లో సల్మాన్ ఖాన్, ఫరాన్ అక్తర్ తదితరులతో ప్రముఖ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా చేసింది.


తెలుగులో గత ఏడాది తిరబడరా సామి సినిమాలో రాజ్ తరుణ్ తో కలిసి జత కట్టినా బాక్సాఫీసు దగ్గర బోల్తాపడింది.



 courtesy: instagram

Tags:    

Similar News