ఇషా రిఖీ విరహ వేదన

Punjabi actress Isha Rikhi latest photo shoot;

Update: 2025-06-17 10:09 GMT

ఇషా రిఖి పంజాబీ చిత్ర పరిశ్రమలో గ్లామర్ క్వీన్. పంజాబ్ నుంచి కెనడా వరకు అభిమానులు ఉన్న ఇషారిఖి విరహ వేదనతో కూడిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


చండీఘడ్ లో 1993లో జన్మించిన ఇషా... మోడల్ గా కెరీర్ ప్రారంభించి సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది.


ఈ అందాల భామ 2012లో జాట్ అండ్ జూలియట్ పంజాబీ సినిమాలో అథితి పాత్ర ద్వారా వెండితెరకు పరిచయమైంది


ఇషా రిఖి 2013లో జట్ బాయ్స్ పుట్ జట్టా దే పంజాబీ సినిమాతో పూర్తి స్థాయి హీరోయిన్ గా అభిమానులకు చేరువైంది. 


2014లో హ్యాపీ గో లక్కీ, మేరే యార్ కమీనీ సినిమాలతో పంజాబీ చిత్రపరిశ్రమలో స్టార్ స్టేటస్ కు చేరుకుంది.


ఇషా ప్రీత్ హర్పాల్ తో కలిసి B.A ఫెయిల్ తోపాటు ఇక్ సాల్, హీరో, చోరి ద పిస్టోల్ వంటి వివిధ పంజాబీ భాషా మ్యూజిక్ అల్బమ్స్ లో చేసింది


2018లో నవాబ్ జాదే సినిమాతో బాలీవుడ్ లోకి ప్రవేశించిన ఇషా రిఖి…వివాదాలకూ కేంద్రబిందువుగా నిలిచింది.


పంజాబీ సింగర్ బాద్షా తో డేటింగ్ లో ఉందని ఇషా రిఖి పై పుకార్లు లేచాయి. దీంతో 2023లో మీడియా పతాక శీర్షికల్లో నిలిచింది.


ఓ పార్టీలో ఇద్దరం కలిసి ఉన్నంత మాత్రాన ఇషా రిఖితో డేటింగ్ అని దుమారం లేపటం సరికాదని, తనకు ఎలాంటి సంబంధం లేదని బాద్షా వివరణ ఇవ్వడంతో పుకార్లు సద్దుమణిగాయి



 courtesy : instagram


 


 


 


 


 



 


 


Tags:    

Similar News