బోల్డ్ బ్యూటీ రాయ్ లక్ష్మీ

Raai Lakshmi has become a go-to for bold roles rather than acting in films;

Update: 2025-05-28 12:17 GMT

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని హీరోయిన్ రాయ్ లక్ష్మి. సినిమా రంగంలోకి రాకముందు ఆమె మోడల్. సోషల్ మీడియాలో ఉర్రూతలూగించే రాయ్ లక్ష్మి...తాజాగా స్కై కలర్ బికినీలో హీటెక్కిస్తోంది


కర్ణాటకలోని బెలగావ్ కు చెందిన ఈ భామ అసలు పేరు లక్ష్మీ రాయ్.. అది కలిసి రావడం లేదని రాయ్ లక్ష్మిగా మార్చుకుంది. గుజరాత్ లోని సౌరాష్ట్ర ప్రాంతానికి చెందిన వీళ్ల కుటుంబం కర్ణాటకలో స్థిరపడింది.


2005లో తమిళ సినిమా కరక కసధారతో సినీ రంగ ప్రవేశం చేసిన ఈ సొగసరి... తమిళంతో పాటు కన్నడ, తెలుగు, మలయాళం, హిందీ సినిమాల్లో నటించింది.

 


 బాలీవుడ్ లో జాలీ2 సినిమాలో అందాలు ఆరబోసి అదరగొట్టేసింది. రాయ్ లక్ష్మి హీరోయిన్ కు తక్కువ... ఐటం గర్ల్ కు ఎక్కువ అన్నట్టుగా మారింది.




 ‘కాంచనమాల కేబుల్ టీవీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందాల లక్ష్మీకి ఆ తర్వాత ఇక్కడ పెద్దగా అవకాశాలు రాలేదు. ఇటీవల ఖైదీ నెంబర్ 150లో ర‌త్తాలుగా మెగా బ్ర‌ద‌ర్స్‌తో చిందేసి టాలీవుడ్ లో హాట్ టాపిక్‌గా మారిపోయింది.




 ఈ బ్యూటీ ఆధినాయకుడులో బాలకృష్ణతో  హీరోయిన్ గా జతకట్టింది. ఖైదీ నంబర్ 150, ‘సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమాల్లో ఐటెం భామగా నటించి గుర్తింపు తెచ్చుకుంది. 



 రాయ్ లక్ష్మి సినిమాల్లో నటన కంటే అందాల విందుకే ప్రాధాన్యత ఇవ్వటంతో... బోల్డ్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అవకాశం దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో అందాలు గుమ్మరిస్తోంది.



 ప్రస్తుతం అంతగా సినిమాలు లేకపోయినా ప్రయత్నాలు కొనసాగిస్తోంది. 2025లో నటన ప్రాధాన్యత గల పాత్రలు వస్తే చేస్తానంటున్న రాయ్ లక్ష్మి.. ఈ ఏడాది చివరిలో పెళ్లి చేసుకుంటానని స్నేహితులతో చెప్పేసింది.


35 ఏళ్ల వయసులోను అప్సరసలా కనిపిస్తోన్న రాయ్ లక్ష్మి ఫారిన్ ట్రిప్ లపై అనేక గాసిప్స్ వినిపిస్తున్నాయి. షూటింగ్ లో గ్యాప్ దొరికితే విదేశాలకు వెళ్లిపోతోందని అనుకుంటున్నారు.


తాజాగా మళ్లీ తెలుగు సినిమాలపై దృష్టి సారించిందని వార్తలు వస్తున్నాయి.




 courtesy: instagram


 


 




 


Tags:    

Similar News