Samyuktha పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సంయుక్త మీనన్
2016లో వెండితెరకు పరిచయమైన సంయుక్త మీనన్;
2016లో వెండితెరకు పరిచయమైన సంయుక్త మీనన్…తమిళ, మలయాళ, తెలుగు, కన్నడ చిత్రపరిశ్రమల్లో హీరోయిన్‌గా నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. తెలుగులో మొదటి సినిమాతోనే అమాయకమైన నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో సందడి చేస్తోంది
1995లో జన్మించిన కేరళ కుట్టి…ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ చేసింది. పాలక్కాడ్ కు చెందిన ఈ భామ మోడలింగ్ తో కెరీర్ ప్రారంభించింది.
2016లో మలయాళ సినిమా పాప్‌కార్న్ తో హీరోయిన్‌గా సంయుక్త మీనన్ కెరీర్ ప్రారంభించింది.
బీమ్లానాయక్ సినిమాతో తెలుగు వారికి పరిచయమైన సంయుక్త మీనన్…బింబిసార, సర్ తదితర సినిమాలు చేసింది.
హిందీలో కాజోల్, ప్రభుదేవ తదితర దగ్గజ నటులతో కలిసి మహరాగ్ని సినిమా చేస్తోంది. ఈ సినిమా విడుదలకు సిద్దమైంది
చిత్ర పరిశ్రమకు వచ్చి పదేళ్లు పూర్తి చేసుకున్న సంయుక్త… ఏడాది నుంచి కోలీవుడ్లో అగ్ర హీరోలతో జతకడుతోంది.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ఒక ప్రాజెక్ట్ ఉంది. యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న స్వయంభు చిత్రంలో కనిపించనుంది.
నారీ నారీ నడుమ మురారి, అఖండ-2తోపాటు మరో తెలుగు సినిమా చేస్తున్న సంయుక్త…ఈ దఫా తెలుగులో పాతుకుపోవాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.
తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సంయుక్తకు అవకాశం దక్కింది. తాజాగా షూటింగ్ కూడా ప్రారంభం అయింది
courtesy : instagram