బుల్లితెర క్వీన్ శ్వేతా తివారీ

టెలివిజన్ రంగంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటిగా పేరొందింది.;

Update: 2025-07-05 10:17 GMT

బుల్లితెర  క్వీన్ గా శ్వేతా తివారి సుపరిచితురాలు. హిందీ, కన్నడ, మరాఠీ, బోజ్ పురి, నేపాలి భాషాల్లో నటించిన శ్వేతా తివారి సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు షేర్ చేసింది.


ఉత్తరప్రదేశ్ లోని ప్రతాప్ ఘడ్ లో 1980లో జన్మించిన శ్వేతా టెలివిజన్ రంగంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటిగా పేరొందింది. 


44 ఏళ్ల వయసులో కూడా కుర్రకారు మతిపోగొడుతున్న ఈ కోమలి… టెలివిజన్ రంగాన్ని ఏలుతోంది. కరోనా సమయంలో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ యూత్ కు చేరువైంది. 


శ్వేతా తివారీ మొదట భోజ్‌పురి నటుడు రాజా చౌదరిని వివాహం చేసుకోగా వివిధ కారణాల వల్ల వారు 2007లో విడాకులు తీసుకున్నారు. తర్వాత ఆమె అభినవ్ కోహ్లీని వివాహం చేసుకున్నా వారు 2019లో విడిపోయారు.


రెండు పెళ్లిళ్లు చేసుకున్నా శ్వేత వైవాహిక జీవితం సాఫీగా సాగలేదు. ఇద్దరు పిల్లలు ఉన్నా ఈ బొద్దుగుమ్మ అందం ఏ మాత్రం తగ్గలేదు కదా మరింత మత్తెక్కిస్తోంది.


మొదటి భర్త రాజా చౌదరితో పెళ్లయ్యాక ఒక అమ్మాయి పుట్టింది. రెండో భర్త అభినవ్ కోహ్లీతొ వివాహం అయ్యాక కుమారుడు రేయాన్ష్ కొహ్లీ జన్మించాడు. ఇద్దరు పిల్లలు ఇప్పుడు శ్వేతతోనే ఉన్నారు. 


శ్వేత తివారి గారాల పట్టి పాలక్ తివారి అప్పుడే బాలీవుడ్ లోకి ఎంటర్ అయింది. 2023లో సల్మాన్ ఖాన్ కుటుంబ కథా చిత్రం కిసీ కా భాయ్ కిసీకి జాన్‌తో పాలక్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. 


బుల్లితెర రంగంలో అందం,అభినయం ద్వారా ఏళ్ల తరబడి రాజ్యమేలుతున్న నటి శ్వేతా తివారీ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. 


శ్వేత తివారి ఫ్యాషన్ విషయంలో రాజీ పడదు. ఎప్పుడూ లేటెస్ట్ ఫ్యాషన్ అనుకరిస్తూ కుర్ర హీరోయిన్లను సవాల్ చేస్తుంది.


శ్వేత వయస్సు పెరిగే కొద్దీ అందం మరింతగా ఇనుమడిస్తోంది. 


 వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకుని నిలబడ్డ సింగిల్ మదర్ శ్వేతా తివారి…అటు పిల్లలను సంభాలిస్తూ…ఇటు కెరీర్ కొనసాగిస్తోంది.



 courtesy : instagram

 





 


 



Tags:    

Similar News