కళ్లతో కనికట్టు చేస్తున్న శ్రీలీల

Tollywood actress sree leela latest photo shoot

Update: 2025-06-24 12:26 GMT

కన్నడ, తెలుగు సినిమాల్లో నటిస్తున్న శ్రీలీల అమాయకపు చూపులతో కుర్రకారును ఆకట్టుకుంటోంది. కళ్లతోనే కనికట్టు చేస్తున్న శ్రీలీల  ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి


అమెరికాలోని ఒక తెలుగు కుటుంబంలో శ్రీలీల 2001లో జన్మించింది.


అందాల శ్రీలీల చిన్నతనంలోనే భరతనాట్యంలో శిక్షణ పొంది ప్రావీణ్యం సాధించింది. 


డాక్టర్ అవ్వాలని కాంక్షతో మెడిసన్  లో చేరింది. 2021 నాటికి ఎం.బి.బి.ఎస్ చివరి సంవత్సరంలో ఉండగా రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టింది 


తెలుగు చిత్ర పరిశ్రమలో పరిచయాలున్నా కన్నడ చిత్రం కిస్(2019 ) కెరీర్‌ ప్రారంభించింది


ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు సినిమా పెళ్లి సందడి (2021)తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.


కన్నడలో నాలుగు సినిమాలు చేసినా తెలుగులోనే వరుసగా చేస్తూ దూసుకుపోతోంది. 


  పుష్ప 2 సినిమాలో 'కిస్సిక్' సాంగ్ అల్లు అర్జున్‌తో కలిసి డ్యాన్స్ చేసి అందర్నీ ఆకట్టుకుంది.


బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్‌తో కనిపించి అప్పట్లో శ్రీలీల వార్తల్లో నిలిచింది. ఆ వెంటనే కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల డేటింగ్ చేస్తున్నట్లుగా రూమర్స్ వినిపించాయి.


 ప్రస్తుతం  నాలుగు తెలుగు సినిమాలు చేస్తున్న ఈ మద్దుగుమ్మ బిజీగా ఉంది


courtesy: instagram

 




 




 


 


Tags:    

Similar News