సినీ తారల వినాయక చవితి

బొజ్జ గణపయ్యకు భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించారు.;

Update: 2025-08-29 12:35 GMT

బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. సినీ హీరోయిన్స్ బొజ్జ గణపయ్యకు భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించారు. దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరిగిన గణేష్ పూజ సమాహారం.


టాలీవుడ్‌ లో స్వింగ్‌ లో ఉన్న ప్రగ్యా జైస్వాల్‌ వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు చేసింది. 








ప్రగ్యా క్లోజ్‌ ఫ్రెండ్స్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తదితరులు పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. 


లిప్‌ స్టిక్‌ అండర్‌ బుర్ఖా ఫేమ్‌ అహానా కుమ్రా భక్తి శ్రద్దలతో లంబోదరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించింది. 


 లక్నో ముద్దుగుమ్మ అహానా కుమ్రా కాలనీలోని వినాయకుడికి కుటుంబసభ్యులతో కలిసి వెళ్లి పూజలు చేసి సందడి చేసింది. 


తెలుగు బిగ్‌ బాస్‌ 4 ఫేమ్‌ అందాల చిన్నది దివి గణేషుడికి సంప్రదాయ బద్దంగా పూజలు చేసింది.


నాగార్జునతో మన్మధుడులో మెరిసిన అన్షు కుటుంబసభ్యులతో కలిసి లండన్‌ లో వినాయక చవితి జరుపుకుంది 


మన్మధుడు తర్వాత ప్రభాస్‌ తో రాఘవేంద్ర సినిమా చేసిన అన్షు వివాహం చేసుకొని లండన్‌ లో స్థిరపడింది 


క్రికెటర్‌ పృథ్వి షా సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ ఆకృతి అగర్వాల్‌ వినాయక చవితి పూజ నిర్వహించింది 


బాలీవుడ్‌ హీరోయిన్‌ అనన్య పాండే కుటుంబసభ్యులతో కలిసి ముంబైలో వినాయక చవితి వేడుకలు జరుపుకుంది 


అనన్య పాండే తండ్రి బాలీవుడ్‌ వెటరన్‌ హీరో చుంకీ పాండే గారాల పట్టి 


బాలీవుడ్‌ క్రేజీ జంట ఆలియా భట్‌, రణబీర్‌ కపూర్‌ బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు చేశారు.


కృష్ణమ్మ సినిమాతో ప్రశంసలు అందుకున్న అర్చన అయ్యర్..ప్రస్తుతం హర్రర్ మూవీ శంభాల చేస్తోంది. 


సాండ్ కీ ఆంఖ్ ఫేమ్... మరాఠీ ముద్దుగుమ్మ భూమి పడ్నేకర్ ముంబైలో వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసింది.  


కొత్త సినిమా నిర్మాణానికి చెందిన టీమ్ తో సినీ నటి చార్మీ తన నివాసంలో వినాయక చవితి వేడుకలు నిర్వహించింది. 


2008 లో బుల్లితెరపై వచ్చిన రామాయణంలో సీతగా నటించిన బెంగాలి భామ దేబినా బెనర్జీ కుటుంబసభ్యులతో కలిసి పూజలు నిర్వహించింది. 


స్టార్ ప్లస్ లో దియా ఔర్ బాతీ హమ్‌లో IPS అధికారి పాత్రతో ఫేమ్ అయిన దీపికా సింగ్ గోయల్ స్నేహితులు, కుటుంబసభ్యులతో చవితి పూజలు చేసింది.


టీ సీరీస్ అధినేత భూషణ్ కుమార్ భార్య దివ్యా కోస్లా హీరోయిన్ కూడా. ఇటీవల వచ్చిన ఎక్ చతుర్ నార్ సినిమాతో విమర్శకులను మెప్పించింది. 


ఐటమ్ సాంగ్స్ తో మెప్పించిన హంసా నందిని పూణేలో వినాయక చవితి వేడుకలు జరుపుకుంది. 


మరాఠీ భామ హంసా నందిని అసలు పేరు పూనమ్ కాగా...క్యాన్సర్ ను జయించి ఇటీవలే కోలుకుంది. త్వరలోనే సెట్స్ లోకి రానుంది. 


ఒకనాడు తెలుగు, తమిళ భాషల్లో అదరగొట్టిన హన్సికా మొత్వానీ ప్రస్తుతం అంతాగా సినిమాలు లేవు. 


మిర్జాపూర్ లో హీరోల చెల్లెలిగా సుపరిచితురాలు హర్షితా గౌర్. వెబ్ సీరీసుల్లో అవకాశాలు వస్తున్న ఈ చిన్నదానికి మనసంతా వెండితెరపై ఉంది. 


శ్రీలంకకు చెందిన జాక్వెలిన్ ఫెర్నాండజ్ బాలీవుడ్ లో ప్రత్యేక గీతాలతో గుర్తింపు తెచ్చుకుంది.


క్రిస్టియన్ అయినా భారతీయ సంప్రదాయాలను గౌరవిస్తూ ఇక్కడ అన్ని పండుగలు జరుపుకుంటుంది. 


గుజరాతీ భామ కరిష్మా తన్నా సంజయ్ దత్ బయోపిక్ లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. వెబ్ సీరీసులు చేస్తూ బిజీగా ఉంది. 


ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్, టీ సీరీస్ భాగస్వామి కుషాలీ కుమార్ ఏకదంతుడికి పూజలు చేసింది. 


ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మాస్ ను ఆకట్టుకున్న కన్నడ భామ నభా నటేష్ పండుగ రోజు తెలుగు పడుచుదానిలా మెరిసింది. 


2017 మిస్ వరల్డ్ మనుషీ చిల్లర్ సామ్రాట్ పృథ్వీరాజ్, బడే మియాన్ చోటే మియా తదితర సినిమాలలో నటించింది. ఈ చిన్నది ఎంబిబిఎస్ డాక్టర్ కూడా


ప్రిన్స్ మహేశ్ బాబు కుటుంబం వినాయక చవితి ఘనంగా జరుపుకుంది.


నమ్రతా శిరోద్కర్ కుమార్తె సితార, కుమారుడు గౌతమ్ కృష్ణ ఫోటోలు అభిమానులతో పంచుకుంది.


హైదరాబాద్ మర్వాడీ చిన్నది నిధి అగర్వాల్ ....హరిహర వీరమల్లు పూర్తిచేసుకొని రాజా సాబ్ షూటింగ్ లో బిజీగా ఉంది 


మెగా స్టార్స్ కుటుంబం ఆడపడుచు కొణిదెల నిహారిక భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించింది


టాలీవుడ్ హీరో ఆది పినిశెట్టి హీరోయిన్ నిక్కి గల్రానీ దంపతులు  పూజలు నిర్వహించారు.


హీరోయిన్ నుస్రత్ బరూచా ముంబైలో లాల్ బగీచా గణేషుడిని దర్శించుకుంది. 


 ప్రముఖ మోడల్ రిద్ది తివారీ లక్నోలో వినాయక చవితి వేడుకలు చేసి అభిమానులతో ఫోటోలు పంచుకుంది.


ప్రముఖ హీరోయిన్ రుక్సర్ థిల్లాన్ జై బోలో గణేష్ మహారాజ్ కి అంటూ ట్యాగ్ చేసింది


సోషల్ మీడియాలో ఫిజికల్ ఫిట్ నెస్ కు మారుపేరుగా చెప్పుకునే సాక్షీ మాలిక్ బొజ్జ వినాయకునికి ప్రత్యేక పూజలు చేసింది.


సినిమాలు, వెబ్ సీరీసులతో బిజీగా ఉన్నా సంప్రదాయ పండుగలు కుటుంబసభ్యులతో చేసుకుంటే ఆ థ్రిల్ వేరే అంటోంది.


 బాలీవుడ్ నటి, గాయనీ షెర్లిన్ చోప్రా వినాయకుడిని ఇంటికి తీసుకొస్తూ మరాఠీ దుస్తులు, డాన్స్ లతో అదరగొట్టింది.


మోడల్, నటి షామా సికిందర్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోంది.


అమెరికన్ వ్యాపారిని వివాహం చేసుకొని అక్కడే స్థిరపడిన షామా సికిందర్..భారతీయ మూలాలను మరచిపోలేదని చెపుతోంది.


ఫర్గాటెన్ ఆర్మీ వెబ్ సీరీస్ తో అభిమానుల మనసు చురగొన్న శార్వారీ వాఘ్ ప్రస్తుతం వెండితెరపై కన్నేసింది. 


వినాయక చవితి రోజు  ప్రత్యేకంగా చేసిన ఓ ఫోటో షూట్ లో పాల్గొన్నది 



 


90 ల్లో బాలీవుడ్ ను షేక్ చేసిన సోనాలీ బింద్రే వినాయకుడి పూజలో పాల్గొన్నది


 బాలీవుడ్ హీరోయిన్ సొనాల్ చౌహాన్ వినాయక చవితి పూజలో పాల్గొంది.


 మెగా కుటుంబానికి చెందిన వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠీతో కలిసి గణేషుడి పూజలు నిర్వహించారు.



 

courtesy : instagram





 





 




 


 



 


 















 







 






Tags:    

Similar News