Vaibhav Suryavanshi: 15 ఏళ్ల చిచ్చరపిడుగు: 52 బంతుల్లో 204 – వైభవ్ సూర్యవంశీ రికార్డుల మోత
| రికార్డుల మోత
Vaibhav Suryavanshi: క్రికెట్ చరిత్రలో ఇంతటి విధ్వంసం ఎవరూ చూడలేదు. 15 ఏళ్ల వయసుకే వైభవ్ సూర్యవంశీ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నమెంట్‌లో యూఏఈపై 53 బంతుల్లో 204 పరుగులు చేసి భారత్-ఎను సెమీఫైనల్‌కు చేర్చాడు. 28 సిక్సర్లు, 7 ఫోర్లతో ఆ ఇన్నింగ్స్‌లో 196 పరుగులు కేవలం బౌండరీలతోనే వచ్చాయి.
28 బంతుల్లో సెంచరీ, 40 బంతుల్లో 150, 52 బంతుల్లో డబుల్ సెంచరీ – ఇవన్నీ లిస్ట్-ఎ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన రికార్డులు. న్యూజిలాండ్‌కు చెందిన చాడ్ బోస్ పేరిట ఉన్న 103 బంతుల ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీని వైభవ్ సగం సమయంలో బద్దలు కొట్టాడు. ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు కూడా ఆయనదే (28 బంతులు). యూఏఈ 249/8 స్కోరు చేయగా, భారత్-ఎ కేవలం 14.2 ఓవర్లలోనే 254/3తో లక్ష్యాన్ని ఛేదించింది.
వియన్ రిచర్డ్స్, వీరేంద్ర సెహ్వాగ్, అభిషేక్ శర్మ లాంటి విధ్వంసక బ్యాటర్ల మధ్య కూడా వైభవ్ ఆడుతున్న తీరు వేరే స్థాయిలో ఉంది. ఆఫ్ స్టంప్ ఆవల బంతిని డీప్ పాయింట్‌లో సిక్సర్, యార్కర్‌ను హెలికాప్టర్ షాట్, అప్పర్ కట్‌తో స్టాండ్స్‌లోకి పంపిన షాట్లు చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. 15 ఏళ్ల వయసుకే ఇంత శక్తి, టైమింగ్, దూకుడు ఎక్కడి నుంచి వస్తుందో అందరికీ ఆశ్చర్యం.
మ్యాచ్ తర్వాత వైభవ్ మాట్లాడుతూ, “గత రెండు మ్యాచ్‌ల్లో స్టార్ట్ ఇచ్చినా కన్వర్ట్ చేయలేకపోయాను. ఈసారి నెమ్మదిగా ఆడాలని అనుకున్నా. కానీ రెండు బంతుల తర్వాత పిచ్‌పై బౌలర్లకు సహాయం లేదని తెలిసి నా బలాలపై నమ్మకం ఉంచా” అని చెప్పాడు. రింకు సింగ్‌తో 137 పరుగుల భాగస్వామ్యం కూడా కీలకమైంది.
ఐపీఎల్‌లో ఇప్పటికే తన ప్రతిభ చాటుకున్న వైభవ్‌కు టీమ్ ఇండియా టీ20లో అవకాశం వచ్చింది. ఇప్పుడు లిస్ట్-ఎలో కూడా రికార్డులు పెట్టి, అనుభవం రావాలని ఎదురు చూస్తే ఆలస్యం కాదని అభిమానులు భావిస్తున్నారు. ఆకాశమే హద్దుగా ఆడుతున్న ఈ చిచ్చరపిడుగు భవిష్యత్తులో ఇంకెన్ని అద్భుతాలు చేస్తాడో చూడాల్సిందే.
ఈ మ్యాచ్ హైలెట్స్ మీరు చూసేయండి.