2026 Australian Open: వరుసగా నాల్గోసారి ఫైనల్ కు సబలెంక
ఫైనల్ కు సబలెంక
2026 Australian Open: 2026 ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారిణి అరీనా సబలెంక వరుసగా నాలుగోసారి ఫైనల్‌కు చేరుకుని చరిత్ర సృష్టించింది.గురువారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆమె ఉక్రెయిన్ క్రీడాకారిణి ఎలినా స్విటోలినాను 6-2, 6-3 తేడాతో ఓడించి ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో వరుసగా 4 సార్లు ఫైనల్‌కు చేరిన మూడవ మహిళగా సబలెంక రికార్డు సృష్టించింది (గతంలో ఎవోన్ గూలాగాంగ్, మార్టినా హింగిస్ మాత్రమే ఈ ఘనత సాధించారు). శనివారం (జనవరి 31, 2026) జరగనున్న ఫైనల్‌లో ఆమె కజకిస్థాన్ స్టార్ ఎలెనా రైబాకినాతో తలపడనుంది. ఈ టోర్నీలో సబలెంక ఇప్పటివరకు ఒక్క సెట్ కూడా కోల్పోకుండా ఫైనల్‌కు చేరడం ఆమె ఆధిపత్యానికి నిదర్శనం.2023 ఫైనల్‌లో కూడా సబలెంక, రైబాకినా తలపడ్డారు, అప్పుడు సబలెంక విజయం సాధించింది. ఇప్పుడు మళ్ళీ అదే రిపీట్ అవుతుందో లేదో చూడాలి!