IPL Mini Auction: ఐపీఎల్ మినీ వేలానికి 350 మంది..ఎపుడు ఎక్కడంటే.?
ఎపుడు ఎక్కడంటే.?
IPL Mini Auction: ఐపీఎల్ 19 సీజన్ వేలానికి చాలా మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఐపీఎల్ మినీ వేలం కోసం ప్రపంచవ్యాప్తంగా మొత్తం 1355 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు ఫ్రాంచైజీల అభ్యర్థన మేరకు, బీసీసీఐ ఈ సంఖ్యను తగ్గించి, చివరకు 350 మంది ఆటగాళ్లతో తుది జాబితాను రూపొందించింది. ఇందులో 240 మంది ఇండియా ప్లేయర్లు ఉన్నారు. 10 జట్లలో 31 మంది పారిన్ ప్లేయర్లతో కలిపి 77 స్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. మొత్తం 10 ఫ్రాంచైజీలు కలిపి కేవలం 77 స్లాట్‌లను మాత్రమే భర్తీ చేయాల్సి ఉంది. వేలం డిసెంబర్ 16న (తేదీ మారే అవకాశం ఉంది) అబుదాబిలో జరగనుంది.
ఈ అత్యధిక బేస్ ధర కేటగిరీలో మొత్తం 40 మంది ఆటగాళ్లు ఉన్నారు.భారత ఆటగాళ్లు వెంకటేష్ అయ్యర్,రవి బిష్ణోయ్ మాత్రమే ఈ కేటగిరీలో ఉన్నారు.కామెరూన్ గ్రీన్, డేవిడ్ మిల్లర్, డెవాన్ కాన్వే, వనిందు హసరంగా మొదలైన ప్రముఖులు ఉన్నారు. వేలంలోకి అత్యధిక డబ్బుతో అత్యధికంగా కేకేఆర్ రూ. 64.3 కోట్ల పర్స్‌తో వేలానికి రానుంది. సీఎస్‌కే (రూ. 43.4 కోట్లు), హైదరాబాద్ (రూ. 25.5 కోట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.వేలం రోజున ఈ 350 మంది ఆటగాళ్లలో ఎవరు అత్యధిక ధర పలుకుతారో చూడాలి.