Duleep Trophy: 4 బంతుల్లో 4 వికెట్లు..దులీప్ ట్రోఫీలో అకీబ్ నబీ రికార్డ్
దులీప్ ట్రోఫీలో అకీబ్ నబీ రికార్డ్;
Duleep Trophy: దిలీప్ ట్రోఫీలో క్వార్టర్ ఫైనల్ లో నార్త్ జోన్ ఫేసర్ అకీబ్ నబీ అద్భుతమైన రికార్డు సృష్టించాడు. ఈ టోర్నమెంట్ చరిత్రలో వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన మొదటి బౌలర్‌గా నిలిచాడు. ఈస్ట్ జోన్ తో జరుగుతున్న మ్యాచ్‌లో అతను ఈ అరుదైన ఘనతను సాధించాడు. ఈస్ట్ జోన్ బ్యాటింగ్ లైనప్‌ను కుప్పకూల్చి, తన బౌలింగ్‌తో నార్త్ జోన్‌కు భారీ ఆధిక్యాన్ని అందించాడు.
ఈ నాలుగు వికెట్ల ప్రదర్శనలో హ్యాట్రిక్ కూడా ఉంది. దిలీప్ ట్రోఫీ చరిత్రలో కపిల్ దేవ్, సైరాజ్ బహుతులే తర్వాత హ్యాట్రిక్ సాధించిన మూడో బౌలర్‌గా కూడా అతను నిలిచాడు. ఈ అద్భుతమైన ప్రదర్శనతో అకీబ్ నబీ ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన నాల్గవ భారతీయ బౌలర్‌గా కూడా రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో అకీబ్ నబీ 10.1 ఓవర్లలో 28 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌లో కూడా 44 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
406 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈస్ట్ జోన్ జట్టు 230 పరుగులకు ఆలౌట్ అయింది. అకీబ్ నబీ 4 వికెట్లతో చెలరేగడంతో ఈస్ట్ జోన్ లోయర్ ఆర్డర్ కకావికలం అయింది. అంతకుముందు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన నార్త్ జోన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 405 పరుగులు చేసింది. ఈ విజయంతో నార్త్ జోన్ సెమీఫైనల్స్ దిశగా అడుగులు వేసింది.