IPL Jerseys Stolen: రూ. 6 లక్షల ఐపీఎల్ జెర్సీలు దొంగతనం!

ఐపీఎల్ జెర్సీలు దొంగతనం!;

Update: 2025-07-30 06:53 GMT

IPL Jerseys Stolen: బీసీసీఐ కార్యాలయం నుంచి ఐపీఎల్ జెర్సీల చోరీకి గురయ్యాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం పరిధిలో ఉన్న బీసీసీఐ కార్యాలయంలో ఈ సంఘటన జరిగింది. సుమారు 261 ఐపీఎల్ 2025 జెర్సీలు చోరీకి గురయ్యాయి. వీటి మొత్తం విలువ దాదాపు రూ. 6.52 లక్షలుగా అంచనా వేస్తున్నారు. ఒక్కో జెర్సీకి సుమారు రూ. 2,500 విలువ ఉంటుందని చెబుతున్నారు. ఈ జెర్సీలు వివిధ ఐపీఎల్ జట్లకు చెందినవి. ఈ చోరీకి పాల్పడిన వ్యక్తి ఫరూఖ్ అస్లాం ఖాన్ అనే 40 ఏళ్ల సెక్యూరిటీ గార్డు. ఇతను వాంఖడే స్టేడియంలో సెక్యూరిటీ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఈ చోరీ జూన్ 13న జరిగింది, అయితే బీసీసీఐ కార్యాలయంలో ఆడిట్ నిర్వహిస్తున్నప్పుడు స్టాక్‌లో తేడాలు రావడంతో ఇటీవల ఇది వెలుగులోకి వచ్చింది. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, ఫరూఖ్ అస్లాం ఖాన్ ఒక కార్టన్ నిండా జెర్సీలను తీసుకువెళ్తున్నట్లు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఫరూఖ్ అస్లాం ఖాన్‌కు ఆన్‌లైన్ జూదం (ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్) వ్యసనం ఉంది. ఆ వ్యసనాన్ని తీర్చుకోవడానికే అతను ఈ జెర్సీలను దొంగిలించి విక్రయించినట్లు ఒప్పుకున్నాడు. అతను ఈ జెర్సీలను హర్యానాకు చెందిన ఒక ఆన్‌లైన్ జెర్సీ డీలర్‌కు సోషల్ మీడియా ద్వారా సంప్రదించి విక్రయించాడు. కార్యాలయంలో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని, అందుకే స్టాక్ క్లియరెన్స్ చేస్తున్నానని డీలర్‌కు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు దొంగిలించిన 261 జెర్సీలలో కేవలం 50 జెర్సీలు మాత్రమే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

Tags:    

Similar News