Team India: క్రికెట్ చరిత్రలో అరుదైన మైలురాయి.. 300వ మ్యాచ్, 200వ విజయంతో సరికొత్త రికార్డు ముంగిట టీమిండియా..
సరికొత్త రికార్డు ముంగిట టీమిండియా..
Team India: భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా నేడు క్రైస్ట్‌చర్చ్ వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ పోరు భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత ప్రత్యేకమైన, చారిత్రక మ్యాచ్‌గా నిలవనుంది. కివీస్‌తో ఈ మ్యాచ్‌లో మైదానంలోకి అడుగుపెట్టగానే టీమిండియా ఓ ప్రపంచ రికార్డును నెలకొల్పడంతో పాటు, గెలిస్తే మరో కనీవినీ ఎరుగని రికార్డును తన ఖాతాలో వేసుకోనుంది.
మైదానంలో దిగగానే వరల్డ్ రికార్డు!
భారత జట్టుకు ఇది అంతర్జాతీయ టీ20ల్లో 300వ మ్యాచ్. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో 300 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ప్రపంచంలోనే తొలి జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించనుంది. 2006లో అంతర్జాతీయ టీ20 ప్రయాణాన్ని ప్రారంభించిన భారత్, ఇప్పటివరకు ఆడిన 299 మ్యాచ్‌లలో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.
గణాంకాల్లో టీమిండియా టీ20 ప్రస్థానం
మొత్తం మ్యాచ్‌లు - 300 నేటి మ్యాచ్‌తో కలిపి)
విజయాలు - 199
ఓటములు - 83
టై అయినవి - 7
ఫలితం తేలనివి - 10
గెలిస్తే డబుల్ సెంచరీ.. 200 విజయాలు సాధించిన ఏకైక జట్టుగా..
ఇప్పటికే 199 టీ20 విజయాలతో అగ్రస్థానంలో ఉన్న భారత జట్టు.. నేటి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఓడిస్తే అంతర్జాతీయ టీ20ల్లో 200 విజయాలు సాధించిన ప్రపంచంలోనే మొట్టమొదటి జట్టుగా రికార్డులకెక్కుతుంది. ఇప్పటివరకు ఏ జట్టు కూడా ఈ మైలురాయికి దరిదాపుల్లోకి కూడా రాలేదు.
ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే సిరీస్‌లోనూ భారత్ 2-0తో తిరుగులేని ఆధిక్యంలోకి దూసుకెళ్తుంది. ఆ తర్వాత మిగిలిన 3 మ్యాచ్‌లలో ఒక్కటి గెలిచినా సిరీస్ సొంతమవుతుంది. దీంతో ఆతిథ్య న్యూజిలాండ్‌పై ఒత్తిడి మరింత పెరగనుంది. సరికొత్త చరిత్రకు వేదికవుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించి 200వ విజయాల పండుగ చేసుకుంటుందో లేదో చూడాలి!