Actress, Singer Andrea Jeremiah: ఐసీసీ ఉమెన్స్ క్రికెట్ కోసం ఆండ్రియా స్పెషల్ ఆంథమ్
క్రికెట్ కోసం ఆండ్రియా స్పెషల్ ఆంథమ్
Actress, Singer Andrea Jeremiah: నటిగా, గాయనిగా బహుముఖ ప్రజ్ఞను చాటుతున్న ఆండ్రియా జెరెమియా తాజాగా ఒక అద్భుతమైన ఘనతను అందుకున్నారు. ఐసీసీ మహిళా క్రికెట్ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ, వారి పట్టుదలను కీర్తిస్తూ ఆమె ఓ ప్రత్యేకమైన ఆంథమ్ ను రాసి, పాడారు.
బ్రింగ్ ఇట్ హోమ్ ఆంథమ్ వివరాలు
2025 టీమ్ కోసం రూపొందించిన ఈ ఆంగ్ల ఆంథమ్ పేరు బ్రింగ్ ఇట్ హోమ్.. క్రీడాకారుల ధైర్యం, ఆసక్తి, పట్టుదలను ఆవిష్కరించేలా.. హై-ఎనర్జిటిక్‌గా దీనిని రూపొందించారు. ఈ పాటను ఆండ్రియా.. నజీఫ్ మహ్మద్ కలిసి రాయగా, ఆండ్రియానే ఆలపించారు. దీనికి నకుల్ అభయంకర్ సంగీతాన్ని అందించారు. ఈ ఆంగ్ల గీతంలో తరికిట్ తరికిట తరికిట థోమ్ అనే ఇండియన్ బాణీ హుక్‌తో కూడిన పల్లవి బ్రింగ్ ఇట్ హోమ్ క్రికెట్ క్రీడాకారుల హృదయ స్పందనను తెలియజేసేలా ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
ఈ ప్రత్యేక గీతం నవంబర్ 2న జరగనున్న ప్రపంచ మహిళా క్రికెట్ క్రీడ తుది పోరు సందర్భంగా విడుదల కానుంది. ఈ ఆంథమ్ గురించి ఆండ్రియా మాట్లాడుతూ.. "ఇది ఒక పాట మాత్రమే కాదు. పెద్దగా కలలు కనడం, కఠినంగా శ్రమించి విజయాన్ని ఇంటికి తీసుకొచ్చే ఒక మహిళ విజయం*" అని పేర్కొన్నారు. నటనతో పాటు సంగీతంలోనూ ఆండ్రియాకు ఉన్న పరిజ్ఞానం ఈ ప్రత్యేక ఆంథమ్ రూపకల్పనకు ఎంతగానో దోహదపడింది.