Alyssa Healy Bids Goodbye to Cricket: క్రికెట్‌కు అలిస్సా హీలీ గుడ్‌బై: భారత్‌తో సిరీసే చివరిది.. భావోద్వేగ ప్రకటన

భారత్‌తో సిరీసే చివరిది.. భావోద్వేగ ప్రకటన

Update: 2026-01-13 07:30 GMT

Alyssa Healy Bids Goodbye to Cricket: మహిళల క్రికెట్ ప్రపంచంలో ఒక శకం ముగియనుంది. ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్, ప్రస్తుత కెప్టెన్ అలిస్సా హీలీ అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అవుతున్నట్లు సంచలన ప్రకటన చేశారు. మంగళవారం నిర్వహించిన ఒక పాడ్‌కాస్ట్‌లో ఆమె తన నిర్ణయాన్ని వెల్లడిస్తూ అభిమానులను ఆశ్చర్యపరిచారు. వచ్చే నెలలో భారత మహిళల జట్టుతో జరగనున్న సిరీస్ తన కెరీర్‌లో చివరిదని ఆమె స్పష్టం చేశారు.

పోటీతత్వం తగ్గడం వల్లే ఈ నిర్ణయం

రిటైర్మెంట్ వెనుక గల కారణాలను వివరిస్తూ.. "నాకు ఆస్ట్రేలియా తరఫున ఇంకా ఆడాలని ఉంది. కానీ మైదానంలో నన్ను ఇన్నాళ్లు నడిపించిన ఆ పోటీతత్వంఇప్పుడు నాలో కొంత తగ్గినట్లు అనిపిస్తోంది. అందుకే సరైన సమయంలో తప్పుకోవాలని భావిస్తున్నాను" అని హీలీ భావోద్వేగంగా తెలిపారు.

సొంతగడ్డపై.. టీమ్ ఇండియాతో ఆఖరి పోరు

భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనున్న సిరీస్‌కు హీలీ ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. తాను టీ20 జట్టులో లేనందున, కేవలం వన్డే, టెస్ట్ మ్యాచ్‌లలో మాత్రమే కనిపిస్తానని ఆమె చెప్పారు. "స్వదేశంలో బలమైన భారత జట్టుతో టెస్ట్, వన్డే కెప్టెన్‌గా నా కెరీర్‌ను ముగిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఏడాది క్యాలెండర్‌లో మాకు ఇది అతిపెద్ద సిరీస్" అని ఆమె అభివర్ణించారు.

భారత్ vs ఆస్ట్రేలియా సిరీస్ షెడ్యూల్:

ఫిబ్రవరి 15 నుంచి టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి:

3 టీ20 మ్యాచ్‌లు

3 వన్డే మ్యాచ్‌లు

1 చారిత్రాత్మక టెస్ట్ మ్యాచ్

వికెట్ కీపర్ బ్యాటర్‌గా, కెప్టెన్‌గా ఆస్ట్రేలియాకు ఎన్నో విజయాలనందించిన హీలీ.. భారత్‌తో జరిగే టెస్ట్ మ్యాచ్‌తో తన సుదీర్ఘ ప్రయాణానికి స్వస్తి పలకనున్నారు.

Tags:    

Similar News