Anil Kumble: నితీశ్ రెడ్డిపై కుంబ్లే ప్రశంసలు
కుంబ్లే ప్రశంసలు;
Anil Kumble: తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డిపై క్రికెట్ దిగ్గజం అనిల్ కుంబ్లే ప్రశంసలు కురిపించాడు. కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో నితీశ్ కుమార్ రెడ్డి బంతులేశాడని కొనియాడాడు. అతడి ఫిట్‌నెస్, ఆటతీరు బాగుందని..అతడి విషయంలో మార్పులు, చేర్పులు చేయొద్దని మేనేజ్‌మెంట్‌కు సూచించాడు కుంబ్లే. ఇంగ్లాండ్‌ను 320 పరుగుల్లోపే కట్టడి చేస్తే భారత్‌దే ఆధిక్యమని అన్నాడు కుంబ్లే.
లార్డ్స్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడవ టెస్ట్‌లో నితీశ్ కుమార్ రెడ్డి తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. మొదటి రోజు ఆటలో ఒకే ఓవర్‌లో ఇంగ్లాండ్ ఓపెనర్లు బెన్ డకెట్ (Ben Duckett) ,జాక్ క్రాలీ (Zak Crawley) ఇద్దరినీ అవుట్ చేసి భారత్‌కు శుభారంభాన్ని అందించాడు. అతని బౌలింగ్ నుంచి ఊహించని బౌన్స్ , సీమ్ ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌లను ఇబ్బంది పెడుతోంది.
టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఇంగ్లాండ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 83 ఓవర్లలో 251/4 స్కోరు చేసింది. రూట్‌తో99పరుగులతో పాటు బెన్ స్టోక్స్ (39 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.భారత బౌలర్లలో నితీశ్ రెడ్డి రెండు వికెట్లు తీయగా..జడేజా,బుమ్రా తలో ఒక వికెట్ తీశారు.