Ashes First Test: యాషెస్ తొలి టెస్ట్: 172 పరుగులకే ఇంగ్లండ్ ఆల్ అవుట్!
172 పరుగులకే ఇంగ్లండ్ ఆల్ అవుట్!
Ashes First Test: క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాషెస్ సిరీస్ తొలి టెస్ట్ మొదటి రోజే ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ అద్భుత ప్రదర్శనతో ఆతిథ్య జట్టు పట్టు సాధించింది. ఆస్ట్రేలియా బౌలింగ్ ధాటికి ఇంగ్లండ్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 172 పరుగులకే ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్‌ను కుప్పకూల్చాడు. స్టార్క్ తన స్వింగ్, పేస్‌తో ఇంగ్లండ్ బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేసి, ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టాడు. ఇది అతని టెస్ట్ కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శనల్లో ఒకటిగా నిలిచింది. గాయాలతో జట్టు నుంచి పాట్ కమ్మిన్స్, జోష్ హేజిల్‌వుడ్ వంటి కీలక ఆటగాళ్లు దూరమైనప్పటికీ, స్టార్క్ అద్భుత ప్రదర్శన ఆస్ట్రేలియాకు ఊరటనిచ్చింది.బజ్బాల్ శైలిలో దూకుడుగా ఆడాలనుకున్న ఇంగ్లండ్‌కు ఈ టెస్టు తొలిరోజే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లండ్ తరపున ఏ బ్యాటర్ కూడా క్రీజులో ఎక్కువ సేపు నిలబడలేకపోయారు. దీంతో, ఆస్ట్రేలియా తొలిరోజే బ్యాటింగ్‌కు దిగి ఆధిక్యం పెంచుకునే స్థితిలో ఉంది. ఆస్ట్రేలియా పేసర్ బ్రెండన్ డాగెట్ కూడా రెండు వికెట్లు పడగొట్టగా, కామెరాన్ గ్రీన్ ఒక వికెట్ తీసుకున్నాడు.