యాషెస్‌ సిరీస్‌.. 132 పరుగులకు ఆస్ట్రేలియా ఆలౌట్‌

132 పరుగులకు ఆస్ట్రేలియా ఆలౌట్‌

Update: 2025-11-22 06:33 GMT

యాషెస్‌ సిరీస్‌ లో భాగంగా ఇంగ్లాండ్ తో జరుగుతోన్న మ్యాచ్ లో ఆస్ట్రేలియా132 పరుగులకు ఆలౌట్‌ అయింది. దీంతో ఇంగ్లాండ్ 40 పరుగుల ఆథిక్యంలో ఉంది. అలెక్స్ కారీ (26) పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచారు. జేక్‌ వెదర్లాండ్‌ (0), లబుషేన్‌ (9), స్టీవ్‌ స్మిత్‌ (17), ఉస్మాన్‌ ఖవాజా (2), ట్రావిస్‌ హెడ్‌ (21), కామెరూన్‌ గ్రీన్‌ (24), మిచెల్‌ స్టార్క్‌ (12), స్కాట్‌ బోల్యాండ్‌ (0), నాథన్‌ లయన్‌ (4) వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. 123/9 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో రెండో రోజు బ్యాటింగ్‌ ప్రారంభించిన ఆసీస్‌ 45.2 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది.ఇక ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 172 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్‌ బౌలర్లలో బెన్‌స్టోక్స్‌ 5, బ్రైడన్‌ కార్స్‌ 3, జోఫ్రా ఆర్చర్‌ రెండు వికెట్లు తీసుకున్నారు. యాషెస్‌ తొలి టెస్టు తొలి రోజు 19 వికెట్లు కూలడం ఇదే మొదటిసారి. 1888 సిడ్నీ టెస్టులో 18 వికెట్లు పడడమే ఇప్పటిదాకా అత్యధికం.

Tags:    

Similar News