Asia Cup 2025: బంగ్లా విక్టరీ..సూపర్ 4 నుంచి హాంకాంగ్ ఔట్.!
సూపర్ 4 నుంచి హాంకాంగ్ ఔట్.!
Asia Cup 2025: ఆసియా కప్ 2025లో బంగ్లాదేశ్ జట్టు హాంకాంగ్ జట్టుపై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. అబుదాబిలో జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ తమ తొలి విజయాన్ని నమోదు చేసుకుంది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన హాంకాంగ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. నిజాకత్ ఖాన్ (42), జీషాన్ అలీ (30), యాసిమ్ ముర్తజా (28) రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెండేసి వికెట్లు తీశారు.
144 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ జట్టు 17.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 144 పరుగులు సాధించి విజయం సాధించింది. కెప్టెన్ లిటన్ దాస్ (59) అర్ధ సెంచరీతో రాణించగా, తౌహిద్ హృదోయ్ (35*) కీలక పాత్ర పోషించాడు.లిటన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ గెలుపుతో బంగ్లాదేశ్ ఆసియా కప్‌లో శుభారంభం చేసింది. హాంకాంగ్‌కు ఇది వరుసగా రెండో ఓటమి.సూపర్-4 రేసు నుంచి తప్పుకుంది. ఆ జట్టు శ్రీలంకతో ఆఖరి మ్యాచ్ ఆడాల్సి ఉంది. అద్భుతం జరిగితే తప్పా హాంగ్ కాంగ్ ముందడుగు వేసే అవకాశం లేదు.