Asia Cup Hockey Tournament: హ్యాట్రిక్ విక్టరీతో సూపర్ 4కు ఇండియా

సూపర్ 4కు ఇండియా

Update: 2025-09-02 05:42 GMT

Asia Cup Hockey Tournament: ఆసియా కప్ హాకీ టోర్నీలో భారత పురుషుల జట్టు సూపర్ 4 దశకు అర్హత సాధించింది. సోమవారం జరిగిన పూల్‌‌‌‌–ఎ మ్యాచ్‌‌‌‌లో ఇండియా 15–-0 తేడాతో కజకిస్తాన్‌‌‌‌ను చిత్తుగా ఓడించింది. దాంతో గ్రూప్‌‌‌‌లో అన్ని మ్యాచ్‌‌‌‌లూ గెలిచిన ఆతిథ్య జట్టు అజేయంగా, అగ్రస్థానంతో సూపర్‌‌‌‌‌‌‌‌–4 రౌండ్‌‌‌‌కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో అభిషేక్ నాలుగు గోల్స్‌తో మెరవగా, సుఖ్‌జీత్ సింగ్, జుగ్‌రాజ్ సింగ్ హ్యాట్రిక్స్ సాధించారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ కూడా ఒక గోల్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

భారత్ గ్రూప్ Aలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి, గ్రూప్ దశలోని మూడు మ్యాచ్‌లలోనూ విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. గ్రూప్ A నుండి భారత్ ,చైనా సూపర్ 4 దశకు అర్హత సాధించాయి. గ్రూప్ B నుండి మలేషియా ,కొరియా జట్లు అర్హత సాధించాయి. సూపర్ 4 దశలో భారత్, మిగిలిన మూడు జట్లతో (చైనా, మలేషియా, కొరియా) తలపడుతుంది. సెమీ ఫైనల్స్,ఫైనల్ మ్యాచ్‌లలో విజయం సాధిస్తే, ఈ టోర్నమెంట్‌లో గెలిచి వచ్చే ఏడాది జరగబోయే హాకీ ప్రపంచ కప్‌కు అర్హత సాధిస్తుంది.

Tags:    

Similar News