Asia Cup: ఆసియా కప్.. సూపర్ 4 స్టేజ్ కు ఇండియా క్వాలిఫై

సూపర్ 4 స్టేజ్ కు ఇండియా క్వాలిఫై

Update: 2025-09-01 09:02 GMT

Asia Cup: ఆసియా కప్ హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టు జపాన్‌పై ఘన విజయం సాధించి సూపర్ 4 స్టేజ్ కు క్వాలిఫై అయ్యింది . గ్రూప్ దశలో కీలకమైన ఈ మ్యాచ్‌లో భారత్ సమష్టిగా రాణించి విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ జపాన్‌ను 3-2 తేడాతో ఓడించింది.

భారత జట్టు తరపున హర్మన్‌ప్రీత్ సింగ్, వరుణ్ కుమార్ , మనదీప్ సింగ్ గోల్స్ సాధించారు. ప్లేయర్స్ ముఖ్యంగా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్‌లను గోల్స్‌గా మలచడంలో మరోసారి తన నైపుణ్యాన్ని చూపించాడు. ఆట ప్రారంభం నుంచి భారత్ ఆధిపత్యం చూపించింది. అటాకింగ్ , డిఫెన్స్‌లో సమతూకం పాటించి జపాన్‌కు ఎలాంటి అవకాశాలు ఇవ్వలేదు.

ఈ విజయం ద్వారా భారత జట్టు గ్రూప్-Aలో అగ్రస్థానంలో నిలిచింది .లీగ్ మ్యాచుల్లో ఇండియా చివరి మ్యాచ్ కజకిస్తాన్ తో తలపడనుంది. 

Tags:    

Similar News