Australia vs India: ఆస్ట్రేలియా Vs ఇండియా మొదటి టీ20 రద్దు.. వర్షార్పణం!
వర్షార్పణం!
Australia vs India: ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరగాల్సిన ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి పోరు వరుణుడి కారణంగా రద్దైంది (Abandoned). కాన్‌బెర్రాలోని మనుకా ఓవల్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో వర్షం పదేపదే అంతరాయం కలిగించడంతో, చివరకు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాకు ఓపెనర్లు మంచి ఆరంభం ఇచ్చారు. అభిషేక్ శర్మ (19 పరుగులు) త్వరగానే ఔటైనా, ఓపెనర్ శుభ్‌మన్ గిల్ మరియు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మెరుపు షాట్లతో చెలరేగిపోయారు. వర్షం అంతరాయం కలిగించే సమయానికి భారత్ 9.4 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది. గిల్ (37), సూర్యకుమార్ యాదవ్ (39) నాటౌట్‌గా నిలిచారు. వారిద్దరూ కలిసి కేవలం 35 బంతుల్లో 62 పరుగుల వేగవంతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ ఎల్లిస్‌కు ఒక వికెట్ దక్కింది. తొలుత వర్షం కారణంగా మ్యాచ్‌ను 18 ఓవర్లకు కుదించినా, మళ్లీ భారీ వర్షం మొదలైంది. ఎంతకీ వర్షం తగ్గకపోవడంతో, తదుపరి ఆట నిర్వహించడం సాధ్యం కాదని నిర్ణయించి, మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఈ రద్దు కారణంగా ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. ఈ ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా రెండో టీ20 మ్యాచ్ అక్టోబర్ 31 (శుక్రవారం) మెల్బోర్న్ వేదికగా జరగనుంది.