Test Cricket Record: మెకేలోని గ్రేట్ బారియర్ రీఫ్ అరేనా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఎడమచేతి వాటం వేగవంతమైన బౌలర్ షోరిఫుల్ ఇస్లాం చారిత్రాత్మక ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ 25 ఏళ్ల పేసర్ తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ తరఫున అత్యధికంగా 14 పరుగులు చేయడమే కాకుండా, బౌలింగ్‌లో కేవలం 15 ఓవర్లలో 48 పరుగులకే 7 వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియాను మొదటి ఇన్నింగ్స్‌లో 210 పరుగులకే కుప్పకూల్చాడు.

ఈ 7 వికెట్ల ప్రదర్శనతో షోరిఫుల్ ఇస్లాం క్రికెట్ చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై ఒకే ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు తీసిన తొలి ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్‌గా (గత 140 ఏళ్ల కాలంలో) రికార్డు సృష్టించాడు.

చివరిసారిగా 1886 జూలైలో మాంచెస్టర్ వేదికగా జరిగిన టెస్టులో ఇంగ్లాండ్‌కు చెందిన డిక్ బార్లో (7/44) అనే ఎడమచేతి వాటం పేసర్ ఆస్ట్రేలియాపై 7 వికెట్లు సాధించాడు. అంతకుముందు 1883 సిడ్నీ టెస్టులోనూ ఆయన ఈ ఘనత సాధించాడు. కాగా, ఆస్ట్రేలియాపై ఒక ఇన్నింగ్స్‌లో 7 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన మొదటి ఎడమచేతి వాటం పేసర్ ఇంగ్లాండ్‌కు చెందిన టామ్ ఎమ్మెట్ (1879 మెల్‌బోర్న్ టెస్టులో 7/68). ఆస్ట్రేలియాపై ఈ ఘనత సాధించిన చరిత్రలో కేవలం నాల్గవ ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్‌గా షోరిఫుల్ నిలిచాడు.

ఇక ఓవరాల్‌గా ఎడమచేతి వాటం బౌలర్లలో ఆస్ట్రేలియాపై అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమో దు చేసిన రికార్డు ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ హెడ్లీ వెరిటీ (1934 లార్డ్స్ టెస్టులో 8/43) పేరిట ఉంది. అలాగే టెస్టుల్లో ఆస్ట్రేలియాపై అత్యుత్తమ బౌలింగ్ నమోదు చేసిన ప్రపంచ రికార్డు ఇంగ్లాండ్ లెజెండ్ జిమ్ లేకర్ (1956 మాంచెస్టర్ టెస్టులో 10/53) పేరిట పదిలంగా ఉంది.

Tags: