Bangladesh: వెస్టిండీస్‌తో జరిగిన మొదటి వన్డే (ODI)లో బంగ్లాదేశ్ విజయం సాధించింది. బంగ్లాదేశ్ 74 పరుగుల తేడాతో గెలిచింది. టాస్ ఓడిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 207 రన్స్‌కు ఆలౌటైంది. తౌహిద్ హ్రిదోయ్ (51) హాఫ్ సెంచరీ చేయగా, మెహిదుల్ ఇస్లామ్ అంకోన్ (46), నజ్ముల్ హుస్సేన్ షాంటో (32), రిషాద్ హుస్సేన్ (26) రాణించారు. జేడెన్ సీల్స్ 3, రోస్టన్ ఛేజ్, జస్టిన్ గ్రీవ్స్ చెరో రెండు వికెట్లు తీశారు. ఛేజింగ్‌లో వెస్టిండీస్ 39 ఓవర్లలో 133 రన్స్‌కే ఆలౌటైంది. బ్రెండన్ కింగ్ (44) టాప్ స్కోరర్. అలిక్ అథనాజే (27), షై హోప్ (15) పోరాడినా ప్రయోజనం దక్కలేదు. ఇన్నింగ్స్‌లో ఏడుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. బంగ్లాదేశ్ స్పిన్నర్ రిషద్ హుస్సేన్ అద్భుతంగా రాణించి 35 పరుగులకే 6 వికెట్లు పడగొట్టి వెస్టిండీస్‌ను 133 పరుగులకే ఆలౌట్ చేశాడు.రిషద్ హుస్సేన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.ఈ విజయంతో 3 వన్డేల సిరీస్‌లో బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యంలో ఉంది.