BCCI: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) అధ్యక్ష పదవికి మాజీ ఢిల్లీ కెప్టెన్ మిథున్ మన్హాస్ నామినేషన్ దాఖలు చేశారు. దాంతో ఆయన ఈ పదవికి ఏకైక అభ్యర్థిగా నిలిచారు. ఈ నెల 28న జరిగే బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన అధికారికంగా అధ్యక్షుడిగా ఎన్నికయ్యే అవకాశం ఉంది.
మిథున్ మన్హాస్ ఎవరు?
మిథున్ మన్హాస్ భారత దేశవాళీ క్రికెట్‌లో సుదీర్ఘకాలం రాణించిన ఒక అనుభవజ్ఞుడైన ఆటగాడు.ఆయన 157 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 9,714 పరుగులు సాధించారు. ఇందులో 27 సెంచరీలు ఉన్నాయి.ఆయన భారత్ తరపున అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడనప్పటికీ, ఆయన దేశవాళీ క్రికెట్‌లో చాలా ప్రభావం చూపారు.
మన్హాస్ 2007-08 రంజీ ట్రోఫీలో ఢిల్లీకి కెప్టెన్‌గా వ్యవహరించి జట్టును విజయపథంలో నడిపించారు.ఆటగాడిగా పదవీ విరమణ చేసిన తర్వాత, ఆయన జమ్మూ అండ్ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ (JKCA)లో పరిపాలనా బాధ్యతలు నిర్వర్తించారు.అలాగే, ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ వంటి జట్లకు కోచింగ్ స్టాఫ్‌లో కూడా ఉన్నారు.మిథున్ మన్హాస్ ఎన్నిక అయితే, అంతర్జాతీయ క్రికెట్ ఆడకుండానే బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన మొదటి ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తారు.