Bumrah: 5 వికెట్లతో చెలరేగిన బుమ్రా..387 రన్స్ కే ఇంగ్లాండ్ ఆలౌట్
387 రన్స్ కే ఇంగ్లాండ్ ఆలౌట్;
Bumrah: లార్డ్స్ లో భారత్ తో జరుగుతోన్న థర్డ్ టెస్టులో ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 387 పరుగులకే కుప్పకూలింది. భారత స్టార్ బౌలర్ బుమ్రా దెబ్బకు ఇంగ్లాండ్ బ్యాటర్లు వెంటవెంటనే పెవిలియన్ కు చేరారు. 5 వికెట్లు తీసి ఇంగ్రాండ్ బ్యాటర్ల నడ్డి విరిచాడు బుమ్రా.
టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఇంగ్లాండ్ భారత బౌలర్ల ధాటికి పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డారు. రూట్ 104 పరుగులతో చేసిటాప్ స్కోరర్ గా నిలిచాడు. జెమీ స్మిత్ (51), కార్స్ (56) హాఫ్ సెంచరీలు చేయగా.. పోప్ (44), స్టోక్స్ (44) పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టాడు. నితీష్, సిరాజ్ రెండు వికెట్లు తీసుకోగా జడేజాకు ఒక వికెట్ పడ్డాయి.
అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా అపుడే ఒక వికెట్ కోల్పోయింది. 13 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర ఓపెనర్ యశస్వి జైశ్వాల్ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. దీందో టీమిండియా 3 ఓవర్లు ముగిసే సరికి ఒక వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది. ఇంకా 371 పరుగుల వెనుకంజలో కొనసాగుతోంది.