Captain Gill: టాప్ 10లోకి కెప్టెన్ గిల్..

కెప్టెన్ గిల్..;

Update: 2025-07-10 07:58 GMT

Captain Gill: ఐసీసీ మెన్స్ క్రికెట్ టెస్ట్ ర్యాంకులను ప్రకటించింది. ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ నం.1 స్థానంలో నిలవగా మరో బ్యాటర్ రూట్ ఓ స్థానం దిగజారి నం.2లో కొనసాగుతున్నారు. మూడోస్థానంలో విలియమ్స్ సన్, భారత బ్యాటర్ జైశ్వాల్ నాలుగో స్థానంలో..స్మిత్ ఐదో స్థానంలో ఉన్నారు. ఇక టీమిండియా కెప్టెన్ గిల్ ఆరోస్థానానికి దూసుకొచ్చాడు.

తొలి టెస్ట్ తర్వాత 21 స్థానంలో ఉన్న గిల్ (807).. ఎడ్జ్ బాస్టన్ టెస్టులో రెండు ఇన్నింగ్స్ ల్లో కలిపి 430 పరుగులు చేయడంతో ఒక్కసారిగా 15 స్థానాలు ఎగబాకడం విశేషం. టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఒక స్థానం దిగజారి 8 వ స్థానానికి చేరుకున్నాడు. బౌలింగ్ లో బుమ్రా టాప్ ర్యాంకు నిలబెట్టుకున్నాడు. బుమ్రాను మినహాయిస్తే భారత్, ఇంగ్లాండ్ జట్లలో ఎవరూ కూడా టాప్-10 లో స్థానం సంపాదించుకోలేకపోయారు. అటు టెస్టుల్లో ఆస్ట్రేలియా, వన్డే, టీ20ల్లో టీమ్ ఇండియా తొలి స్థానంలో ఉన్నాయి. 

Tags:    

Similar News