Shreyas Iyer Car : ఖరీదైన కారు కొన్న టీమిండియా స్టార్ ప్లేయర్
టీమిండియా స్టార్ ప్లేయర్ శ్రేయాస్ అయ్యర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. నిజానికి, ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లాండ్‌లో పర్యటించిన భారత టెస్ట్ జట్టులో శ్రేయాస్ అయ్యర్‌కు చోటు దక్కలేదు. దీంతో తన కుటుంబంతో అయ్యర్ చిల్ అవుతున్నాడు. ఈ క్రమంలో అతడు ఖరీదైన కారు కొన్నాడు. కారుకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా షేర్ చేయగా.. అవి వైరల్ గా మారాయి. అయ్యర్ మెర్సిడెస్ జి-వ్యాగన్ అనే కారును కొన్నాడు. దీని విలువ రూ.3 కోట్లకు పైగా ఉంటుందట.
ఐపీఎల్‌లో అయ్యర్ మెరిశాడు
ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ జట్టుకు శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అతని నాయకత్వంలో పంజాబ్ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. కానీ ఫైనల్లో వారు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. ఈ టోర్నమెంట్ అంతటా, శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీ, బ్యాటింగ్ రెండింటిలోనూ అద్భుతంగా రాణించాడు. అతడు 17 మ్యాచ్‌ల్లో 175.07 స్ట్రైక్ రేట్‌తో 604 పరుగులు చేశాడు. అందులో 6 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అయినప్పటికీ, ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు అతన్ని సెలక్టర్లు ఎంపిక చేయలేదు.